Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
Jammu Kashmir Exit Polls News | జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించనుందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది.
Jammu Kashmir Exit Polls 2024 Live Updates | జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి దాదాపు దశాబ్దం తరువాత ఎన్నికలు జరిగాయి. దశాబ్ద కాలంలో తొలిసారిగా పోలింగ్‌కు వెళ్లిన జమ్మూ కాశ్మీర్‌లో చివరిదశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిశాయి. అనంతరం పలు సర్వే సంస్థలు జమ్మూ కాశ్మీర్ లో అధికారం ఎవరిదో తేల్చేందుకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. హర్యానాతో పాటు జమ్మూకాశ్మీర్ లోనూ బీజేపీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందనున్నాయని వచ్చింది. అధికారంలోకి వస్తామని ఆశించిన బీజేపీకి భంగపాటు తప్పదు అనిపిస్తోంది. జమ్మూకాశ్మీర్ లో 90 అసెంబ్లీ స్థానాలుండగా సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్, ఎన్సీ కూటమికి 40 నుంచి 48 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 27-32, పీడీపీ 6 నుంచి 12 సీట్లు, ఇతరులకు 6 నుంచి 11 సీట్ల వరకు రానున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జమ్మూ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమికి 35 నుంచి 50 సీట్లు, పీడీపీకి 4 నుంచి 12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. తమదే అధికారం అని భావించిన బీజేపీకి 20 నుంచి 32 సీట్లు రావచ్చని, ఇతరుల సైతం 18 వరక సీట్లు నెగ్గే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 20-25 సీట్లు రాగా, కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 35 నుంచి 40 సీట్లు, పీడీపీకి 4 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓటర్ల అభిప్రాయం సేకరించి సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించాయి.
పీపుల్స్ పల్స్ సైతం కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూటమికి 46 నుంచి 50 సీట్లు, బీజేపీకి 23నుంచి 27 సీట్లు, పీడీపీకి 7-11 సీట్లు, ఇతరులక 4-6 సీట్లు రానున్నాయి.
సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 27 నుంచి 32 సీట్లు, కాంగ్రెస్ -NC కూటమికి 40 నుంచి 48 సీట్ల, పీడీపీకి 6-12 సీట్ల, ఇతరులకు 6-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
సర్వే సంస్థలు | కాంగ్రెస్ - NC | బీజేపీ | పీడీపీ | ఇతరులు |
సీఓటర్ | 40-48 | 27-32 | 6-12 | 6-11 |
పీపుల్స్ పల్స్ | 46-50 | 23-27 | 7-11 | 4-6 |
దైనిక్ భాస్కర్ | 35-40 | 20-25 | 4-7 | 12-16 |
Matrize (రిపబ్లిక్ భారత్) | 31-36 | 28-30 | 5-7 | 8-16 |
చాణక్య (న్యూస్-24) | 46-50 | 23-27 | 7-11 | 4-6 |