Top Headlines Today: బడ్జెట్ సమావేశాలు ప్రారంభం- సీమలో కర్నాటకం తెలంగాణలో పెద్దల సభ రాజకీయం- నేటి టాప్ టెన్ వార్తలు ఇవే
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
ఆఖరి దఫా పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి కొత్త సభ్యులు, కొత్త ప్రభుత్వ కొత్త మంత్రిమండలి కొలువు దీరి ఉంటుంది. అందుకే ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టబోతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజకీయ వంటకాలు
ఆమె ఒక స్ట్రీట్ వెండర్. పదేళ్లుగా ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ ఆమె కుటుంబం జీవనం సాగిస్తూ ఉంది. ఆమె వంటకాలతో వడ్డించే భోజనానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ మహిళ కష్టపడుతున్న తీరు, ఆహారం ఈ మధ్య మరీ ఫేమస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అదే ఇప్పుడు ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. ఆమె ఫేమ్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు వాడుకోవడం కూడా మొదలైపోయింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జగన్ Vs రాంబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'సిద్ధం' అంటూ సమరశంఖం పూరిస్తే... తెలుగుదేశం పార్టీ 'సంసిద్ధం' అంటూ కౌంటర్ ఇచ్చింది. జనసేన 'మేము సిద్ధమే' అంటూ బరిలో నిలిచింది. ఇప్పుడీ రాజకీయాలు థియేటర్లలోకి వచ్చాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆఖరి రోజు
రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు నేడే ఆఖరిరోజు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన పోలీసుశాఖ...మళ్లీ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. ద్విచక్రవాహనాలు(Bikes ), ఆటో(Auto)లకు 80శాతం, ఆర్టీసీ (RTC) బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజ్యసభ ఎన్నిక కాక
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ పదవీకాలం ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టేస్తున్నారు. షెడ్యూల్ విడుదలయింది. ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం అయితే కాంగ్రెస్ కు రెండు సీట్లు ఖాయం. బీఆర్ఎస్ ఒకటి వస్తుంది. కానీ కాంగ్రెస్ మూడో స్థానానికి పోటీ పెడితే మాత్రం బీఆర్ఎస్ కఠిన పరీక్షన ఎదుర్కోవాల్సి ఉంంటుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వాతావరణం ఎలా ఉంది?
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయం దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీలో కర్నాటకం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావుడి కర్ణాటకలో కనిపిస్తోంది. ఓట్లు వేయమని అక్కడకి వలస వెళ్లిన వాళ్లను రప్పించే హడావుడి కాదు... ముందు సీటు దక్కించుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ సీటు దక్కించుకోవాలంటే కర్ణాటకలోని కొందరు నేతలను ప్రసన్నం చేసుకోవాలట. అప్పుడే ఇక్కడ సీటు చిరిగిపోకుండా భద్రంగా ఉంటుంది. అంతేనా అవసరమైతే వేరే వాళ్ల సీటును చింపేసి ప్రసన్నం చేసుకున్న వాళ్లకు ఇచ్చేస్తారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా కోలుకోని మార్కెట్
మంగళవారం నాడు నష్టాలు మిగిల్చిన ఇండియన్ బెంచ్‌మార్క్ సూచీలు, ఈ రోజు (బుధవారం, 31 జనవరి 2024) కూడా లోయర్ సైడ్‌లోనే ప్రారంభమయ్యాయి. మధ్యంతర బడ్జెట్‌కు ముందు రోజు కావడం, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అస్థిరంగా ఉన్నాయి. అయితే, ఆ ప్రతికూలతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫుల్ ప్రాక్టీస్
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు విశాఖ వేదికగా జరగనుంది. ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. వీరంతా బుధ, గురువారాల్లో ప్రాక్టీస్ చేయనున్నారు. తొలి టెస్టులో అనూహ్యంగా భారత్ జట్టు ఓటమిపాలు కావడంతో లోపాలపై దృష్టి సారించి వాటిని సరి చేసుకునేలా ప్రాక్టీస్‌కు ఆటగాళ్లు ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నారు.మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
షాకింగ్ నిర్ణయం
ముందుగా హిందీ భాషలో ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తర్వాత ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యింది. అందుకే సౌత్ భాషల్లో కూడా దీనిని ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. దాంతో పాటు అదనంగా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. తాజాగా టీవీలో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. కానీ ఈ సీజన్‌కు ఎన్నో కష్టాలు ఎదురయ్యేసరికి అసలు ఓటీటీ రెండో సీజన్ ఉంటుందా లేదా అని డౌట్లు మొదలయ్యాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి