అన్వేషించండి

Vizag Test Match: విశాఖకు చేరిన భారత క్రికెటర్లు.. నేటి నుంచి రెండు రోజులపాటు ప్రాక్టీస్‌

Visakha Test Match: ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న టెస్ట్‌ కోసం భారత ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. బుధ, గురువారాల్లో ప్రాక్టీస్‌ చేయనున్నారు.

Ind Vs Eng 2nd Test In Vizag: భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు విశాఖ వేదికగా జరగనుంది. ఏసీఏ-వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి రెండో తేదీన ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆటగాళ్లు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. వీరంతా బుధ, గురువారాల్లో ప్రాక్టీస్‌ చేయనున్నారు. తొలి టెస్టులో అనూహ్యంగా భారత్‌ జట్టు ఓటమిపాలు కావడంతో లోపాలపై దృష్టి సారించి వాటిని సరి చేసుకునేలా ప్రాక్టీస్‌కు ఆటగాళ్లు ఎక్కువ సమయాన్ని కేటాయించనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన ఆటగాళ్లు బస్సుల్లో భారీ భద్రత నడుమ నోవాటెల్‌కు చేరుకున్నారు. బుధవారం ఉదయం స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్‌ చేయనునున్నారు. ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మంగళవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. క్రికెట్ సంఘం అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా బుధవారం సాయంత్రం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశం ఉంది.

మార్పులు.. చేర్పులకు అవకాశం

తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలు కావడం భారత జట్టును కొంత నిరాశకు గురి చేసి ఉంటుది. ఓటమి నుంచి కోలుకుని గెలుపు బాట పట్టాల్సిన బాధ్యత భారత ఆటగాళ్లపై ఉంది. తొలి టెస్టు విజయం ఇంగ్లాండ్‌ జట్టులో ఉత్సాహాన్ని నింపుతుండగా, భారత ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేస్తోంది. స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక తొలి టెస్టులో చతికిలపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తితంది. ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాళ్లు ఔటైనా.. పోప్‌ ఒక్కడే అద్భుత పోరాటంతో జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టాడు. అటువంటి పోరాటం భారత ఆటగాళ్లలో ఒక్కరూ కూడా చేయలేకపోయారు. ఆ పోరాట పటిమ లేకపోవడంతోనే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు స్వల్ప మార్పులతో బరిలోకి దిగేందుకు భారత్‌ జట్టు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. తొలి టెస్టు ఆడిన జడేజా స్థానంలో కుల్దీప్‌కు అవకాశం కల్పించే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌ మాదిరిగా ఒకే పేసర్‌తో బరిలోకి దిగాలని భారత్‌ భావిస్తే సిరాజ్‌పై వేటు పడే అవకాశముంది. ఇక బ్యాటింగ్‌ విభాగంలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. మిడిలార్డర్‌ను పటిష్టం చేసేందుకు రజత్‌ పటీదార్‌, సర్పరాజ్‌ల్లో ఒకరికి అరంగేట్రం చాన్స్‌ లభించవచ్చని చెబుతున్నారు. 

ఒత్తిడి భారత్‌పైనే

ఇంగ్లాండ్‌ ఎప్పట మాదిరిగానే బజ్‌ బాల్‌ వ్యూహంతోనే రెండో టెస్టులో బరిలోకి దిగే చాన్స్‌ ఉంది. ఆది నుంచి దూకుడుగా ఆడి భారీ స్కోర్‌ చేసే లక్ష్యంతో ఇంగ్లాండ్‌ ఉంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తేనే ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు అవకాశముంటుంది. ఏమాత్రం అదును దొరికినా ఇంగ్లాండ్‌ బ్యాటర్లు విజృంభించే చాన్స్‌ ఉంది. ఓపెనర్లతోపాటు బెయిర్‌ స్టో, బెన్‌ స్టో టచ్‌లో ఉన్నారు. వీరికి కుదురుకునే చాన్స్‌ ఇస్తే మాత్రం భారత్‌ ముందు భారీ స్కోరును ఉంచే ప్రమాదముంది. కాబట్టి, వీరిని త్వరితగతిన ఔట్‌ చేస్తేనే ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget