![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Latest Update: నేడు సాధారణంగా చలి, హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలు - ఐఎండీ
Hyderabad News: హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
![Weather Latest Update: నేడు సాధారణంగా చలి, హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలు - ఐఎండీ Weather in Telangana Andhrapradesh Hyderabad on 31 January 2024 Winter updates latest news here Weather Latest Update: నేడు సాధారణంగా చలి, హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17 డిగ్రీలు - ఐఎండీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/30/d804e533e0af1f82cd955ecda28521d31706633934158234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయం దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.1 డిగ్రీలుగా నమోదైంది. 69 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ, తూర్పు దిశల్లో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)