అన్వేషించండి

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఆలస్యం కానుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియపై డీఎస్సీ నోటఫికేషన్ ఆధార పడి ఉంది.

Andhra Pradesh DSC 2024: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదో షాకింగ్ న్యూస్‌ అనే చెప్పవచ్చు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో డీఎస్సీ ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వర్గీకరణ ఈ నోటిఫికేషన్ నుంచే అమలు చేయాలని వచ్చిన విజ్ఞప్తితో దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్ వేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తోంది. అందుకే ఆలస్యమవుతుంది. 

Also Read: వృక్ష వ్యాధి శాస్త్ర పితామహుడు ఎవరో తెలుసా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. అయితే ముందుగా టెట్ నిర్వహించాలని చాలా మంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం చేసి ముందుగా టెట్ నిర్వహించారు. ఈ మధ్య ఆ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ వేసే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్న డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. లేకుంటే వచ్చే డీఎస్సీ నాటికి తామంతా నష్టపోతామంటూ చాలామంది ఎస్సీ నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను వేసింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాను నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులతో స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాస్త ఆలస్యమైనా సరే అనుకున్నట్టుగానే ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించింది. విలైతే సభలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. 

ఈ మధ్య కాలంలో పదే పదే డీఎస్సీ అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావిస్తున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే తాము ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వస్తుందని లోకేష్ పదే పదే చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని అంటున్నారు. ముందు నుంచి అదే చెబుతున్నామని దానికి కట్టుబడి ఉన్నామని వివరిస్తున్నారు. 

 
 

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget