Today Current Affairs: వృక్ష వ్యాధి శాస్త్ర పితామహుడు ఎవరో తెలుసా?
Current Affairs And GK: ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో డీఎస్సీ, టెట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థులకు జీకే, కరెంట్ అఫైర్స్ చాలా అవసరం. నేటి కరెంట్ అఫైర్స్ మీ కోసం..!
Current Affairs On 17th November: ఏపీలో ప్రస్తుతం గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. అటు, తెలంగాణలోనూ గ్రూప్ 2, టెట్ సహా బ్యాంక్ ఉద్యోగాలు ఇతర పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేలా స్టాటిక్ జీకే ఇక్కడ అందిస్తున్నాం.
బయలాజికల్ సైన్స్
1. వృక్ష శాస్త్ర పితామహుడు: థియో పాస్ట్రస్. అయితే వృక్షవ్యాధి శాస్త్ర పితామహుడు (father of plant pathology) ఎవరు?--హెన్రిచ్ అంటోన్ డిబారీ
2.NIO(National Institute of Ostenography) ఎక్కడ కలదు?-- పనాజీ(గోవా)
3. ప్రపంచ చక్కెర వ్యాధి ( World Diabetes Day)దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?--నవంబర్ 14
4. న్యూక్లియర్ శక్తిని ఉత్పత్తి చేసే మూలకాలు ఏవి?--యురేనియం, ఫ్లూటోనియం
5. జీవుల నుండి ఉత్పత్తి చేయబడే గ్యాస్ బయోగ్యాస్ దీనిలో అధికంగా ఉండే వాయువు?--మిథేన్(CH4)
6. రక్త పోటును తగ్గించుటకు ఉపయోగించే ఔషధం (రిసర్పిన్) దీని నుండి సంగ్రహిస్తారు?--రావుల్పియా సర్పెంటైనా (సర్ప గ్రంథి)
7. సాధారణ జలుబు: ముక్కు కారటం, తలనొప్పి ,దగ్గు మొదలైన లక్షణాలు ఏ వైరస్ వల్ల కలుగుతాయి?--రైనో వైరస్
8. రక్తం యొక్క pH విలువ?--7.4
9. తేలు యొక్క శ్వాసావయవాల పేరు?--పుస్తకాకార ఊపిరితిత్తులు
10. జీవితాంతం నీటిని తాగని కీటకం?--లెపిస్మా(Silver fish)
11. Silver Revolution అనగానేమి?--గుడ్లు ఉత్పత్తి
12. మానవుని దంత ఫార్ములా?--2123/2123
13. బైనాక్యులర్ విజన్ అనగానేమి?--రెండు కళ్ళు ఒకే వస్తువును (లేక) వ్యక్తిని చూడటం. (మానవుడు,గుడ్లగూబ)
14. వేప (ఆజాడి రక్త ఇండికా) వృక్షము నుంచి లభించు ఔషధం నింబిన్, అయితే నింబిన్ పైన పేటెంట్ హక్కును కలిగిన దేశం ఏది?--ఇండియా
15. క్వీన్ ఆఫ్ స్పైసిస్ (Queen of Spices) యాలకులు (Ilachi) అయితే, కింగ్ ఆఫ్ స్పైసెస్ (King of Spices) వేటిని పిలుస్తారు?--మిరియాలు (Black Pepper)
ప్రతిరోజూ జీకే సహా కరెంట్ అఫైర్స్ సైతం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచుతాం.