అన్వేషించండి
Tirumala: తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ - మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించిన శ్రీనివాసుడు
Tirumala Garuda Seva: తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడు గరుడునిపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ
1/6

తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.
2/6

శుక్రవారం రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడడైన శ్రీనివాసుడు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
3/6

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.
4/6

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.
5/6

జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
6/6

గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అందుకే గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
Published at : 15 Nov 2024 09:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion