అన్వేషించండి

Bigg Boss Telugu OTT 2: బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌ క్యాన్సల్? అందుకే రద్దుచేయాల్సి వచ్చిందా?

Bigg Boss Non Stop: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. ఫిబ్రవరీలో ప్రారంభం కానున్న 2వ సీజన్ క్యాన్సల్ అవ్వనున్నట్టు సమాచారం.

Bigg Boss Telugu OTT 2: ముందుగా హిందీ భాషలో ప్రారంభమయిన బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తర్వాత ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యింది. అందుకే సౌత్ భాషల్లో కూడా దీనిని ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. దాంతో పాటు అదనంగా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. తాజాగా టీవీలో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి కావడంతో బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. కానీ ఈ సీజన్‌కు ఎన్నో కష్టాలు ఎదురయ్యేసరికి అసలు ఓటీటీ రెండో సీజన్ ఉంటుందా లేదా అని డౌట్లు మొదలయ్యాయి.

ఫిబ్రవరీ మొదటి వారంలో..

టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్‌ఫుల్ కావడంతో ఓటీటీలో కూడా మొదలయ్యింది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యింది. ఈ రియాలిటీ షోను రెగ్యులర్‌గా చూసేవారు, దీని కాన్సెప్ట్‌ను ఇష్టపడేవారు తప్పా పెద్దగా ప్రేక్షకులు ఎవరూ బిగ్ బాస్ తెలుగు ఓటీటీని పట్టించుకోలేదు. అయినా కూడా బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవ్వడంతో ఓటీటీలో 2వ సీజన్ ప్రారంభిస్తే.. చాలామంది చూస్తారని మేకర్స్ భావించారు. అందుకే ఫిబ్రవరీ మొదటి వారంలోపు కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేసి సీజన్‌ను ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంతలోనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 2వ సీజన్ పలు సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.

ఆ ముగ్గురు రెడీ..

మామూలుగా బిగ్ బాస్ ఓటీటీలో పూర్తిగా కొత్త కంటెస్టెంట్స్ ఉంటారని గ్యారెంటీ లేదు. ఇందులో కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా మళ్లీ బిగ్ బాస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ముందుకొస్తారు. బిగ్ బాస్ నాన్‌ స్టాప్‌లో కూడా అఖిల్, యాంకర్ శివ, తేజస్వి లాంటివారు మళ్లీ కంటెస్టెంట్స్‌గా వచ్చారు. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన నయని పావని, భోలే షావలి, ప్రిన్స్ యావర్.. ఓటీటీలో కూడా పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కానీ వీరు తప్పా ఇంక ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ ఇందులో పాల్గొనడానికి కనీసం ఆసక్తి చూపించడం లేదట. బిగ్ బాస్ 7 పూర్తయిన తర్వాత మరోసారి ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చి.. మళ్లీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదంటూ పలువురు కంటెస్టెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

గొడవ ఎఫెక్ట్..

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు జరిగిన గొడవ కూడా కంటెస్టెంట్స్ నిర్ణయానికి కారణం కావచ్చని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇది ఒక రియాలిటీ షో అని, ఇందులో ఎవరో ఒక్కరే విన్నర్ అవుతారు అని కనీసం జ్ఞానం లేకుండా కొంతమంది అభిమానులు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై దాడులు చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. కంటెస్టెంట్స్ కార్ల వెంట పరిగెడుతూ వారిని బూతులు తిట్టారు. ఇదంతా చూసిన తర్వాత వారికి బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనాలనే ఆలోచన అస్సలు లేదని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ మేకర్స్ కూడా ఓటీటీ సీజన్‌ను క్యాన్సల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక హోస్ట్‌గా వ్యవహరించాల్సిన నాగార్జున సైతం తన సినిమాలతో బిజీగా ఉండడంతో ఓటీటీ సీజన్‌ను క్యాన్సల్ చేయడమే మేలు అని భావిస్తున్నారట. మరి, ఇది ఎంత వరకు నిజమనేది నిర్వాహకులే చెప్పాలి. ప్రస్తుతం దీనిపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

Also Read: ఆ స్టార్‌ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి - నిజమెంత?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget