అన్వేషించండి

Hyderabad News: పెండింగ్ ట్రాఫిక్ చలానా రాయితీతో చెల్లించేందుకు నేడే ఆఖరి రోజు

Hyderabad News: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు నేడు ఆఖరి రోజు. మరోసారి గడువు పొడిగించేది లేదని ఖరాఖండిగా పోలీసులు తేల్చి చెప్పారు

Hyderabad News: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపులకు నేడే ఆఖరిరోజు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన పోలీసుశాఖ...మళ్లీ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. ద్విచక్రవాహనాలు(Bikes ), ఆటో(Auto)లకు 80శాతం, ఆర్టీసీ (RTC) బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు.

గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు పోలీసుశాఖ అవకాశం కల్పించింది. తొలుత 15 రోజులు మాత్రమేనని తెలిపిన పోలీసుశాఖ( TS Police)...సాంకేతిక కారణాలతో పలుమార్లు సర్వర్‌ మొరాయించి ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెలాఖరి వరకు గడువు పొడిగించింది. దీంతో పెంచిన గడువు నేటితో ముగియనుండడంతో...ఇంకా చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు ఎవరైనా సరే ఆన్‌లైన్‌ ద్వారా త్వరగా చెల్లించాలని పోలీసుశాఖ అలర్ట్‌ ఇచ్చింది.

మళ్లీ గడువు పెంచేది లేదు

పెండింగ్ చలాన్లు (Pending Traffic Challans) రాయితీతో చెల్లించేందుకు మళ్లీ గడువు పెంచేది లేదని పోలీసుశాఖ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మళ్లీ గడువు పెంచుతారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. రేపటి నుంచి పూర్తి మొత్తం వసూలు చేయనున్నట్లు కూడా హెచ్చరించింది. కాబట్టి పెండింగ్ చలాన్లు ఉన్న వారు డిస్కౌంట్ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే భారీ రాయితీతో పెండింగ్ చలాన్లు కట్టించుకుంటున్నా....ఇంకా సగం మంది చలాన్ల సొమ్ముకట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. పెండిగ్ చలాన్ల ద్వారా పోలీసుశాఖకు భారీగానే ఆదాయం వచ్చినా...ఆశించిన మేర వసూలు కాలేదు. గతంలో దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు కాగా....ఇప్పుడు అందులో సగం మేర మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

చలానా వేసినా లెక్కచేయని వాహనదారులు

భారీ మొత్తంలో చలాన్లు విధించినా....వాహనదారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. పదేపదే ట్రాఫింక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పెండింగ్ చలాన్లే దీనికి నిదర్శనం. ఇప్పటికీ మూడోవంతు బైక్‌ నడిపేవారు హెల్మెట్(HELMET) ధరించడం లేదు. పోలీసుల ముందే ట్రిఫుల్ రైడింగ్‌లతో చక్కర్లు కొడుతున్నారు. ఇక రాంగురూట్‌లో వచ్చేవారి సంగతి సరేసరి.ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా చలాన్లు విధించినా...పోలీసుశాఖ రాయితీ ఇస్తుందనే దీమాతో చాలామంది వాహనదారులు యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

కఠిన చర్యలేవీ..

మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న వారిపై నామమాత్రపు కేసులు విధించి చేతులు దులుపుకుంటున్నారు. అలాగే పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసుశాఖ ప్రకటించినా....ఈ దిశగా పెద్దగా అడుగులు పడిన దాఖలాలు లేవు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనూ వాహనదారుల్లో భయం లేకుండా పోయింది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో పనిభారం పెరిగిపోయి....పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Embed widget