News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top Headlines Today: మహిళాబిల్లుకు జై కొట్టిన దిగువ సభ- తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ సీన్స్! మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today

 

నారీశక్తికి జై కొట్టిన లోక్‌సభ

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు, పాసైన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు లాంటి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లుకు సుమారు 27 ఏళ్ల తర్వాత మోక్షం లభించింది. కానీ, డీలిమిటేషన్‌ తర్వాతే మహిళలకు రిజర్వేషన్‌ కోటా అమలుకానుంది. దీంతో లోక్‌సభలో మహిళల సీట్ల సంఖ్య 181కు పెరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ సీన్స్‌ 

 తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు కూడా పరిస్థితుల్ని దారికి తీసుకురావడం లేదు. అసంతృప్తి వాదులు పెరిగిపోతున్నారు. కొంత మంది  సైలెంట్ గా ఉంటూండగా.. మరికొంత మంది కాంగ్రెస్ నేతల్ని పొగడటం ప్రారంభించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ తరపున పార్లమెంట్ అభ్యర్థులు అవుతారనుకుంటున్న కొంత మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నట్టు?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి వారం దాటిపోయింది. రెండు, మూడు రోజుల్లో అక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని మళ్లీ తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన తిరిగి రాలేదు. మరో వైపు ఏపీలో లోకేష్‌నూ అరెస్టే చేస్తామని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ నూ అరెస్ట్ చేస్తే తదుపరి కార్యాచరణను టీడీపీ ఖరారు చేసుకుంది. నారా బ్రాహ్మణిని తెరపైకి తీసుకు వస్తున్నారు. రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. యూత్ ఐకాన్ అవుతారని టీడీపీ నేతలు కూడా గట్టి నమ్మకం  పెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ ఉత్సాహంగానే ఉంటుంది. గత సమావేశాలకు చంద్రబాబు హాజరు కాకపోయినా టీడీపీ నేతలు అసెంబ్లీలో హడావిడి చేశారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరి అసెంబ్లీలో టీడీపీని నడిపించేది ఎవరు..? బాలయ్య అంతా తానై చూసుకుంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎందుకు వ్యతిరేకించామంటే: ఒవైసీ

ఢిల్లీ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరగగా 454 మంది అనుకూల ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దాంతో లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఓటింగ్ అనంతరం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ఈబీసీలు యాభై శాతం జనాభా ఉన్నా లోక్ సభలో కేవలం 22 శాతం మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు. ముస్లింల విషయానికొస్తే నాలుగు లోక్ సభలలో ఒక్క ముస్లిం మహిళా ఎంపీ కూడా లేరని గుర్తుచేశారు. 1957, 62, 91లో ముస్లిం మహిళలకు లోక్ సభలో ప్రాతినిథ్యం దొరకలేదన్నారు. ఈ కారణంతో ముస్లింలకు, ఈబీసీలకు సైతం మహిళా రిజర్వేషన్లో అవకాశం కల్పించాలని పార్లమెంట్ లో తమ వాదనను వినిపించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రాజ్యసభలో చంద్రబాబు ప్రస్తావన

రాజ్యసభలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు..? అయితే గియితే ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ టీడీపీ ఎంపీలు ఆ ప్రస్తావన తెచ్చారంటే ఓ అర్థముంది. కానీ అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రెండుసార్లు ఆయన పేరు చెప్పి మరీ విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కళ్లన్నీ వీళ్లపైనే 

వచ్చే నెల నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్ రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్, కేన్ మామ వంటి ఆటగాళ్లకు ఆఖరి  ప్రపంచకప్  కాగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్న యువ ఆటగాళ్లకు మాత్రం ఇదే  తొలి  వన్డే  ప్రపంచకప్.  ప్రతి ప్రపంచకప్ మాదిరిగానే ఈసారీ పలువురు యువ ఆటగాళ్లు తమ సత్తా ప్రపంచానికి చాటేందుకు  సిద్ధమవుతున్నారు. వారిలో  ఇదివరకే తమ ఆటతో మెరిసిన కొంతమంది యువ ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిలో టాప్- 4 ప్లేయర్స్ గురించి ఇక్కడ చూద్దాం.. ఈ నలుగురికీ ఇదే తొలి వన్డే ప్రపంచకప్ కావడం గమనార్హం.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పిచ్‌పై ఐసీసీ సూచనలు

భారత్ వేదికగా అక్టోబర్- నవంబర్ మాసాల‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించేందకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. మ్యాచ్‌‌లను రసవత్తరంగా మార్చాలంటే ముఖ్యభూమిక పోషించే పిచ్ క్యూరేట్లరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్‌లను వన్ సైడెడ్ పోరులా కాకుండా ఇరు జట్లకూ బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉండేలా చూడాలని, ఆ దిశగా పిచ్‌లను తయారుచేయాలని కోరింది. బౌండరీ లైన్ దూరాన్ని పెంచాలని, పిచ్ మీద పచ్చిక ఎక్కువ ఉండేలా చూసుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా  అక్టోబర్- నవంబర్ మాసాలలో మంచు మ్యాచ్‌ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో  అందుకు తగ్గట్టుగా పిచ్‌లను తయారుచేయాలని క్యూరేటర్లను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

'జోరుగా హుషారుగా షికారు పోదమ'  అంటున్న సంతోష్ శోభన్

సక్సెస్ కోసం యువ హీరో సంతోష్ శోభన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్టు కోసం కష్టపడుతున్న సంతోష్.. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 'కళ్యాణం కమణీయం', 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే', 'ప్రేమ్ కుమార్' సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు 'జోరుగా హుషారుగా షికారు పోదమ' అంటూ వస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నెల్సన్ దిలీప్‌కుమార్ కు తెలుగు హీరో ఛాన్స్  

ఒక దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఫ్లాప్ అయితే.. తనను నమ్మి ఏ హీరో డేట్స్ ఇవ్వడు. కానీ తనకు మరో ఛాన్స్ వస్తే.. ఏ రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వగలడో అని నిరూపించుకున్న దర్శకులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా అందులో నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు కూడా యాడ్ అయ్యింది. కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్‌ లాంటి వారికి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏ స్టార్ హీరో కూడా నెల్సన్ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని అనుకోడు. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాత్రం నెల్సన్‌ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకున్నాడు. దీంతో మరో తెలుగు స్టార్ హీరో కూడా నెల్సన్‌కు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

Published at : 21 Sep 2023 08:44 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

GGH Paderu: పాడేరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 256 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!

టాప్ స్టోరీస్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Telangana Election Results 2023: విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు చేస్తే కఠిన చర్యలు - నేతలు, కార్యకర్తలకు అలర్ట్

Telangana Election Results 2023: విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు చేస్తే కఠిన చర్యలు - నేతలు, కార్యకర్తలకు అలర్ట్

Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్

Weather Update: మిచాంగ్ తుపానుగా మారిన వాయుగుండం, ఏపీపై తీవ్ర ప్రభావం - భారీ వర్ష సూచనతో IMD రెడ్ అలర్ట్