అన్వేషించండి

Balakrishna Leads TDP: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీని నడిపించేది బాలయ్యేనా?

లోకేష్ మాజీ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీకి రాలేరు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అంత ధీమాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలరా అనే అనుమానాలున్నాయి. ఇప్పుడు అందరి చూపూ బాలయ్యపైనే ఉంది.

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీడీపీ ఉత్సాహంగానే ఉంటుంది. గత సమావేశాలకు చంద్రబాబు హాజరు కాకపోయినా టీడీపీ నేతలు అసెంబ్లీలో హడావిడి చేశారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు. కానీ ఈసారి పరిస్థితి వేరు. చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరి అసెంబ్లీలో టీడీపీని నడిపించేది ఎవరు..? బాలయ్య అంతా తానై చూసుకుంటారనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. 

చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య రెండు రోజులు లీడ్ రోల్ పోషించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో బావ కుర్చీలో కూర్చుని మరీ రివ్యూ మీటింగ్ లు పెట్టారు. చంద్రబాబు అరెస్ట్ బాధతో మరణించిన వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. జైలులో పవన్ ములాఖత్ సమయంలో కూడా బాలకృష్ణ అన్నీ తానై చూసుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన సీన్ లోనుంచి మాయమయ్యారు. రెండు మూడు రోజులుగా భువనేశ్వరి, బ్రాహ్మణి నిరసనలను ముందుండి నడిపిస్తున్నారు. రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతున్నారు. పరామర్శలకు వచ్చేవారిని వారే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి అసెంబ్లీలో టీడీపీ తరపున పోరాటం చేసేది ఎవరు అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. లోకేష్ మాజీ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీకి రాలేరు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నా కూడా ఆయన అంత ధీమాగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలరా అనే అనుమానాలున్నాయి. ఇప్పుడు అందరి చూపూ బాలయ్యపైనే ఉంది. అసెంబ్లీలో దబిడ దిబిడ ఆయన వల్లే సాధ్యమంటున్నారు. 

నందమూరి అభిమానులు కోరుకుంటున్నదేంటి..?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత, నారా-నందమూరి ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు కొంతమంది వ్యూహాలు పన్నారు. టీడీపీ అనుకూల మీడియా బాలయ్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, వైపీసీ అనుకూల మీడియాలో సింపతీ చూపించడం ఇక్కడ విశేషం. ఒకవేళ నిజంగానే బాలయ్యకు ప్రాధాన్యత వచ్చినా వారు తట్టుకోలేని పరిస్థితి. అయితే టీడీపీలో మాత్రం అలాంటి వ్యవహారాలేవీ లేవంటున్నారు నేతలు. నారా అయినా, నందమూరి అయినా టీడీపీ పటిష్టత కోరుకుంటున్నామని చెబుతున్నారు. బాలయ్య ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించినా, చంద్రబాబు వచ్చాక పార్టీపై పెత్తనం ఆయనకే ఉంటుందని, అందులో అనుమాన పడాల్సిన అవసరం లేదంటున్నారు. 

వాస్తవానికి బాలయ్య కూడా పార్టీపై పెత్తనం కోరుకోవడంలేదు. అక్కడ ఉన్నది సొంత బావ, సొంత అల్లుడు. అలాంటి ఉమ్మడి కుటుంబంలో చిచ్చురేపడం ఆయన అభిమతం కూడా కాదు. అయితే ఇప్పుడు ఆయన షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. నాలుగు రోజులుగా రాజమండ్రిలో కనపడ్డంలేదు, అటు పార్టీ ఆఫీస్ కి కూడా రావడంలేదు. రేపటినుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు బాలయ్య కచ్చితంగా హాజరవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎమ్మెల్యేలను ఆయనే ముందుండి నడిపిస్తారని చెబుతున్నారు. అదే నిజమైతే నందమూరి అభిమానుల ఆనందం మరింత రెట్టింపవుతుంది. కష్టకాలంలో బాలయ్య సేవలు టీడీపీకి ఉపయోగపడినట్టు కూడా ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Mayor Election: ఏబీవీకి బెజవాడ షాక్ - మేయర్ పోరులో డిపాజిట్ గల్లంతు.. ఇక పొలిటికల్ ఫ్యూచర్ ఉండేనా?
ఏబీవీకి బెజవాడ షాక్ - మేయర్ పోరులో డిపాజిట్ గల్లంతు.. ఇక పొలిటికల్ ఫ్యూచర్ ఉండేనా?
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
MPTC ZPTC Elections Polling: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Embed widget