అన్వేషించండి

Telangana BJP : తెలంగాణ బీజేపీ ఎందుకు దారికి రావడం లేదు ? మళ్లీ రహస్య సమావేశాల గుట్టేమిటి ?

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి నేతల రహస్య సమావేశాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌కు బీజేపీ దగ్గరవుతోందన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు.

Telangana BJP :  తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు కూడా పరిస్థితుల్ని దారికి తీసుకురావడం లేదు. అసంతృప్తి వాదులు పెరిగిపోతున్నారు. కొంత మంది  సైలెంట్ గా ఉంటూండగా.. మరికొంత మంది కాంగ్రెస్ నేతల్ని పొగడటం ప్రారంభించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ తరపున పార్లమెంట్ అభ్యర్థులు అవుతారనుకుంటున్న కొంత మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 

మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో రహస్య సమావేశం                  

మూడు రోజుల క్రితం బీజేపీలోని అసంతృప్త నేతలు మాజీ ఎంపీ వివేక్ ఫామ్ హౌస్‌లో సమావేశం అయ్యారని బీజేపీలో ఒక్క సారిగా పుకారు గుప్పు మంది. ఈ సమావేశానికి  మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సీనియర్‌ నేతలు గరికపాటి రామ్మోహనరావు, చాడా సురేశ్‌రెడ్డిలు హాజరయ్యారని చెబుతున్నారు.  బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమను పట్టించుకోవడం లేదని పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని వారు భావిస్తున్నారు. 
          
బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరవుతోందన్న సంకేతాలతో అసంతృప్తి                
 
బీజేపీ బీఆర్‌ఎస్‌కు దగ్గరవుతుండటంతో పాటు పార్టీలో బండి, ఈటల, కిషన్‌రెడ్డికే ప్రాధాన్యతనిస్తున్నారని అసంతృప్త నేతలు భావిస్తున్నారు.  ఇదే విషయమై గతంలో కూడా ఈ సీనియర్లు తమ నిరసన గళాలను విప్పారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని భావించినా… ఢిల్లీ పెద్దల జోక్యంతో అది అప్పటికి ఆగిపోయింది. కానీ ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు జోష్‌ పెరిగిందనే వాతావరణం ఏర్పడటంతో మళ్లీ ఈ సీనియర్లందరూ తమ భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.   ఈ ఎనిమిది మందిలో ఐదారుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ భావించింది. ప్రస్తుతం వారు రహస్యంగా భేటీ కావటం, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారనే సంకేతాలతో కమలంలో కలకలం రేగుతోంది.                  

సోనియాను పొగడుతూ విజయశాంతి ట్వీట్ 

సీడబ్ల్యూసీ భేటీ, విజయభేరి సభ కోసం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్న సోనియా దృష్టిలో పడేందుకు సీనియర్ నేత విజయశాంతి ప్రయత్నించారు.  సోనియాగాంధీని వ్యక్తిగతంగా   గౌరవిస్తానని ప్రకటించారు.  విజయశాంతి ట్వీట్‌ చేయటం బీజేపీలో కీలక పరిమామాలకు దారి తీస్తోంది. గతంలో ఈటల రాజేందర్ కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ అవసరం బీఆర్ఎస్‌కు ఏర్పడేలా సీట్లు తెచ్చుకోవాలన్న టార్గెట్ మాత్రమే అమిత్ షా పెట్టినట్లుగా ప్రచారం జరుగుతూండటంతో.. బీఆర్ఎస్ ను ఓడించాలన్న తమ సంకల్పం నెరవేరదని.. కొంత మంది అసంతృప్తి చెందుతున్నారు. వీరు పార్టీ మారుతారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Fatal Accident In Jaipur: జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
జైపూర్‌లో ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ట్ర‌క్కు..పెట్రోల్ బంకులో పేలుడు.. 8 మంది స‌జీవ ద‌హ‌నం
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Embed widget