అన్వేషించండి

Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు

Andhra Pradesh News | తెలుగు వాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్. ఆయన సినిమాలు, రాజకీయాలు తెలుగు వారికి స్ఫూర్తి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

AP CM Chandrababu | విజయవాడ: ‘యుగ పురుషుడు పుడితే చరిత్ర ఎలా మరిచిపోదో, దానికి నిదర్శనం దివంగత ఎన్టీఆర్. గత ఏడాది మొత్తం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. మనం చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే మొత్తం తెలుగు జాతిని గౌరవించడం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడి సాధిస్తాం’ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. 

9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక నేత ఎన్టీఆర్

అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి, తెలుగింటి ఆత్మ గౌరవం, ప్రపంచ వ్యాప్తంగా అదే గుర్తింపు కలిగిన మహా శక్తి ఎన్టీఆర్. పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం కేవలం ఎన్టీఆర్‌కు సాద్యమైంది. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన చోట సువర్ణాధ్యాయం. ఎన్టీఆర్ నటించిన మన దేశం నటించిన మనదేశం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. చరిత్రను చూసి స్ఫూర్తిగా తీసుకోవాలి. పల్లెటూర్లో, రైతు కుటుంబంలో నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 25 జన్మించిన యుగ పురుషుడు ఎన్టీఆర్. చదువు కోసం విజయవాడకు వచ్చానని నాకు చెప్పారు. పాలు అమ్మి తరువాత గుంటూరుకు వెళ్లి చదువుకున్న వ్యక్తి. 

Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు

దేవుడు అంటే ఎన్టీఆర్ రూపం గుర్తొస్తుంది

1945లో మద్రాసు రైలెక్కాక ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది. సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్. 300 సినిమాల్లో నటించారు. ఆయన ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేశారు. ఇప్పుడు ఒక్క సినిమాకు మూడేళ్లు పడుతుంది. భారత సినీ చరిత్రలో ఇన్ని సినిమాలు, ఇన్ని విభిన్న పాత్రలు చేసింది ఎన్టీఆర్. వెంకటేశ్వరస్వామి, రాముడు, కృష్ణుడు పాత్రలు అంటే ఆయనే. మనం దేవుడ్ని చూడలేదు. కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడ్ని చూస్తున్నాం. శ్రీరాముడిగా మీరే, రావణుడిగా మీరే చేస్తారు. ఓవైపు కృష్ణుడు, మరోవైపు దుర్యోధనుడిగా ఎలా చేస్తారని అడిగాను. విశిష్టమైన వ్యక్తుల లక్షణాలను గమనించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్.

జోలి పట్టి విరాళాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్
వీరబ్రహ్మేంద్రస్వామి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు లాంటి పాత్రలు సైతం ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా పోషించారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ (TDP) నిలిచి ఉంటుంది. గతంలో రాయలసీమలో కరువు, దివిసీమలో తుపాను వస్తే ప్రముఖ నటుడు అయి ఉండి, జోలి పట్టి ఎండలో వెళ్లి విరాళాలు సేకరించారు. పేదలకు రూ.1కి కిలో బియ్యం అందించిన నేత ఎన్టీఆర్. సభ్యత్వ నమోదు మొదలుపెట్టగా 73 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. సమాజమే దేవాయలం, ప్రజలే దేవుళ్లుగా భావించి పరిపాలన చేసిన మహనీయుడు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి నేత ఎన్టీఆర్’ అని చంద్రబాబు కొనియాడారు.

Also Read: AP Elections: జమిలి అమల్లోకి వచ్చినా, 2029లోనే ఏపీలో ఎన్నికలు - ఏపీ సీఎం చంద్రబాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget