అన్వేషించండి

Nelson Dilipkumar: తెలుగు స్టార్ హీరోను టార్గెట్ చేసిన ‘జైలర్’ దర్శకుడు, తరువాతి సినిమా ఆయనతోనే!

ఒక దర్శకుడికి ఒక హీరో అవకాశం ఇవ్వాలనుకుంటే.. తను తెరకెక్కించే ఒక సినిమా చాలు. అలా ‘జైలర్’ అనే ఒక బ్లాక్‌బస్టర్ అందించినందుకు ఒక తెలుగు స్టార్ హీరో.. నెల్సన్‌కు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం.

ఒక దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఫ్లాప్ అయితే.. తనను నమ్మి ఏ హీరో డేట్స్ ఇవ్వడు. కానీ తనకు మరో ఛాన్స్ వస్తే.. ఏ రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వగలడో అని నిరూపించుకున్న దర్శకులు ఎంతోమంది ఉన్నారు. తాజాగా అందులో నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు కూడా యాడ్ అయ్యింది. కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్‌ లాంటి వారికి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏ స్టార్ హీరో కూడా నెల్సన్ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని అనుకోడు. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్ మాత్రం నెల్సన్‌ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకున్నాడు. దీంతో మరో తెలుగు స్టార్ హీరో కూడా నెల్సన్‌కు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

తెలుగు స్టార్‌తో సినిమా..
కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా ఒకరు. తెరకెక్కించింది కొన్ని సినిమాలే అయినా.. తన కమర్షియల్ చిత్రాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ ఇంతలోనే స్టార్ హీరో విజయ్‌తో ‘బీస్ట్’లాంటి చిత్రాన్ని చేశాడు. సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది, కలెక్షన్స్ సాధించింది. కానీ విజయ్ ఫ్యాన్స్ దగ్గర నుండి మాత్రం తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. అయినా కూడా ‘బీస్ట్’ విడుదలయిన కొన్నిరోజుల్లోనే రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఇప్పుడు రజినీకాంత్‌తో ‘జైలర్’ విడుదలయిన కొన్నిరోజులకే ఒక తెలుగు స్టార్ హీరోతో నెల్సన్ దిలీప్‌కుమార్.. సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

‘జైలర్’ ఇచ్చిన ఊపుతో..
రజినీకాంత్‌తో నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’.. బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. కలెక్షన్స్ విషయంలో అయితే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక కథ గురించి నెల్సన్ దిలీప్‌కుమార్ చర్చలు జరిపాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ‘జైలర్’ లాంటి ఒక కమర్షియల్ సినిమా అల్లు అర్జున్‌కు పడితే.. చాలా బాగుంటుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘జైలర్’ తర్వాత నెల్సన్ ప్లాన్ ఏంటి అని సందేహంలో ఉన్న ప్రేక్షకులకు కూడా ఇది గుడ్ న్యూస్‌లాగా మారింది.

అప్పుడు అట్లీ.. ఇప్పుడు నెల్సన్..
ప్రస్తుతం అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్ అందుకున్న సంతోషంలో ఉన్నాడు. ఆ సంతోషంలోనే ‘పుష్ప 2’ షూటింగ్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ పార్ట్ 1కు ఇప్పటికే నేషనల అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. పార్ట్ 2 కోసం అంతకంటే ఎక్కువగా కష్టపడాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ప్లాన్స్ ఏంటి అని మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. తాజాగా కోలీవుడ్ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఆ స్థానంలో నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు వినిపిస్తోంది. మరి బన్నీ తరువాతి చిత్రం అట్లీతో ఉంటుందా? నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఉంటుందా? అనే విషయం క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యా - సాయి పల్లవి ఈజ్ బ్యాక్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan : ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్
ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget