Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
SI Suicide Case | ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Mulugu SI Suicide Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న వాజేడు ఎస్సై హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వెంకటాపురం సీఐ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితురాలి అరెస్టును వెల్లడించారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులు
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు కారణమైన మహిళ పేరు బానోతు అనసూయ. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన ఆమె వీబీఐటీ కళాశాల (VBIT College)లో అడ్మిన్‌స్టాఫ్‌గా పనిచేస్తోంది. దాదాపు ఏడు నెలల కిందట ఓ రాంగ్ నంబర్‌తో ఫోన్ చేసి ఎస్సై హరీష్ కు పరిచయమైంది. పరిచయాన్ని పెంచుకుని పదే పదే ఎస్సై హరీష్ కు కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలో కొన్ని రోజులకు తనను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. హరీష్ అందుకు టైమ్ తీసుకున్నాడు. కానీ తనను పెళ్లి చేసుకోవాలని అనసూయ పదే పదే ఒత్తిడి చేయడం, పెళ్లికి ఒప్పుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. తాము మాట్లాడిన ఫోన్ కాల్స్, ఇతర ఆధారాలు ఉన్నాయంటూ ఎస్సై హరీష్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్లు సీఐ వివరించారు.
నిజాలు తెలియడంతో పెళ్లికి ఒప్పుకోని ఎస్సై
ఈ క్రమంలో మండపాక శివారులో ఉన్న రిసార్ట్‌లో ఎస్సై హరీష్ ను చివరగా కలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మరోసారి బెదిరింపులకు దిగడంతో రిసార్ట్ లోనే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడంతో ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం చెందాడని వెంకటాపురం సీఐ వెల్లడించారు. అయితే మొదట ఎస్సై హరీష్ ఆమె ప్రేమకు ఓకే చెప్పారని, అయితే ఆమె గురించి ఏవో కొన్ని నిజాలు తెలియడంతో పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అనసూయను అన్ని సాక్షాధారాలతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి.
గర్భవతినని బెదిరించడంతో ఎస్సై సూసైడ్
గతంలో కొందరు యువకుల్ని ఆమె ఇలాగే ప్రేమ పేరుతో వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరిపై ఆమె ఫిర్యాదు చేసి కేసులు పెట్టించి వేధించినట్లుగా ఎస్సై హరీష్ గుర్తించారు. ఈమె వేధింపులు భరించలేక గతంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఎస్సై హరీష్ కు ఆమెతో రాంగ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా చాటింగ్ చేసేవారు. ఫోన్ చేసి మాట్లాడుకునే వారు. పరిచయాన్ని, ప్రేమ పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఆమె గురించి వాకబు చేయగా ఎస్సై హరీష్‌కు ఏదో అనుమానం రావడంతో పెళ్లికి ఓకే చెప్పలేదని బ్లాక్ మెయిల్ చేసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి జాబ్ తీసేయిస్తానని టార్చర్ చేయడంతో సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు. తాను గర్భవతినని బెదరించడంతో ఎస్సై హరీష్ చనిపోయారని ప్రచారంలో ఉంది.
Also Read: Vajedu SI Harish Suicide: వాజేడు ఎస్సై హారీష్ ఆత్మహత్య వెనుక వలపు వల, వెలుగులోకి కిలేడీ మోసాలు