అన్వేషించండి

Morning Top News: ఏపీలో పుష్ప సీన్ రిపీట్, దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వంటి మార్నింగ్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

రాజకీయాల నుంచే తప్పుకోవాలనుకున్నా: కేటీఆర్

18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అన్నారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని... రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జగన్ కు ఆస్కార్ ఇవ్వొచ్చన్న మంత్రి 
అబద్ధాల్లో  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని..మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. పోలవరంపై జగన్ చేసిన విమర్శలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ ఛీత్కారానికి  గురయ్యారని సెటైర్లు వేశారు. ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన దౌర్భాగ్య రాజకీయవేత్త జగనే అని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


పుష్ప సీన్ రిపీట్.. ట్యాంకర్ లో స్మగ్లింగ్
పుష్ప సినిమాలో  ట్యాంకర్ల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సీన్ తో స్ఫూర్తి పొందిన కొందరు అదే ప్లాన్‌తో గంజాయి స్మగ్లింగ్‌కు యత్నించారు. అనుమానంతో పోలీసులు చెక్ చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని చూసిన పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. వాంకిడి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ ట్యాంకర్లో గంజాయి లభించింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కమ్మేసిన పైరసీ భూతం.. ఏటా రూ. 22 వేల కోట్ల ఆదాయం
భారత సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం డిజిటల్ ప్లాట్‌ఫాంలను కూడా వదలట్లేదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో ఉండే కంటెంట్ అంతా పైరసీలో కూడా అందుబాటులో ఉంది. దీని కారణంగా మంచి కంటెంట్‌కు డబ్బులు రావడం లేదు. భారత పైరసీ ఎకానమీ విలువ మనదేశ కరెన్సీలో రూ.22,400 కోట్లు వరకు ఉంటుందని ఎర్న్‌స్ట్ అండ్ యంగ్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  కలిసి విడుదల చేసిన ‘ది రాబ్ రిపోర్ట్’ పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మారని మృగాళ్ల తీరు

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తెలంగాణలో ఓ మైనర్‌పై నలుగురు మైనర్లే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లాలో ఓ మైనర్‌పై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. నలుగురు మైనర్లు 8వ తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సుూచన
 తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలోని ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

దీపావళి రోజున ప్రమాదాలు
దీపావళి పండుగ రోజున ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏలూరులో ఓ వ్యక్తి బాణాసంచా తీసుకెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది. సుధాకర్ అనే వ్యక్తి బైక్‌పై ఉల్లిపాయ బాంబుల బస్తా తీసుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా బైక్‌పై నుంచి బస్తా కింద పడింది. ఈ క్రమంలో భారీ పేలుడు  సంభవించి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  విశాఖ జైలు రోడ్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

స్మశానంలో ఘనంగా దీపావళి వేడుకలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు దీపావళి వేడుకలను బాణాసంచా కాలుస్తూ ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లల్లో, దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. అయితే కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో మాత్రం శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగించారు. కార్ఖానాగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో 60 ఏళ్లుగా దీపావళి వేడుకలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు

ప్రజలకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. తెల్లారేసరికి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచి 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారు. ఇండియన్ ఆయిల్ కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు నవంబర్ 1 నుంచి రూ.62 పెంచి ఒక్కో సిలిండర్ ధర రూ.1802కి పెంచింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా ఇదే 

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. గురువారం కొన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లతో జాబితాను విడుదల చేశాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లకు అత్యధిక ధరను దక్కించుకున్నాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Thaman On OG Movie: 'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Thaman On OG Movie: 'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
'ఓజీ'లో రమణ గోగుల పాట... పవన్ తనయుడు అకిరా నందన్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
Embed widget