KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
KTR Chitchat With Netigens: తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని.. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ట్విట్టర్ వేదికగా 'ఆస్క్ కేటీఆర్' (#ASKKTR) పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అన్నారు. 'బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వస్తారు.
Not much can be expected from a congress govt that got elected on false guarantees and propaganda
— KTR (@KTRBRS) October 31, 2024
Now that they can’t deliver on any of their promises, all they can do is distract and blame
This too shall pass brother https://t.co/PhrPMaIkwh
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయాం. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయి. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టం. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేస్తాం. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు.' అని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవం దేశంలోనే అతి పెద్ద స్కాం అని.. హైడ్రా అనేది ఓ బ్లాక్ మెయిలింగ్ టూల్ అని కేటీఆర్ ఆరోపించారు. వీటిపై నెటిజన్లు ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి వాళ్ల ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు. అయితే, పెద్దవాళ్ల ఇళ్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని.. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని అన్నారు. విలువలు లేని రాజకీయాలు తాము చేయలేమని.. అవి ఎక్కువ కాలం ఉండవని పేర్కొన్నారు.
Intentions seem noble on paper but the real agenda is Loot
— KTR (@KTRBRS) October 31, 2024
We are not against Musi beautification but are against Musi Lootification
HYDRA has become selective; no big builder would be targeted but people of lower income groups are ruthlessly exploited https://t.co/Sdg6U4KkFH
Let’s wait for 5 years. People have made a choice and we should respect it https://t.co/oyWrQlltGH
— KTR (@KTRBRS) October 31, 2024
Let’s wait and watch brother
— KTR (@KTRBRS) October 31, 2024
Politics is a dynamic field and Congress is a unpredictable political machine https://t.co/MSa0utSeBN
1. My self-belief, support of BRS family and my own family & friends
— KTR (@KTRBRS) October 31, 2024
2. Fountainhead, Fallen leaves and The secret https://t.co/jIdDJ3kQ61
Also Read: Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!