అన్వేషించండి

Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?

Karimnagar News: దీపావళి వేడుకలను వారు శ్మశానంలో నిర్వహిస్తారు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Diwali Celebrations In The Cemetry In Karimnagar: దీపావళి అంటేనే దివ్వెల పండుగ. చిన్న పెద్దా అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి సంతోషంగా బాణాసంచా కాలుస్తూ వేడుకలు చేసుకుంటారు. ఇళ్లల్లో, దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. వ్యాపారులు లక్ష్మీపూజ చేస్తారు. అయితే, అక్కడ మాత్రం శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకొంటారు. తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వింత వేడుకలు కరీంనగర్ జిల్లాలో జరుపుతారు. దీపావళి రోజును శ్మశానంలో సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఈ ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లోని (Karimnagar) కార్ఖానాగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో దాదాపు 60 ఏళ్లుగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఓ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు శ్మశానంలో తమ కుటుంబీకుల సమాధుల వద్దనే వేడుకలు చేసుకుంటూ వస్తున్నారు. దీపావళికి వారం రోజుల ముందు నుంచే పెద్దల సమాధులు శుభ్రం చేసి రంగులు వేస్తారు. పువ్వులతో సుందరంగా అలంకరిస్తారు. పండుగ రోజు సాయంత్రం సమాధుల వద్దకు వచ్చే వేడుకలు నిర్వహిస్తారు. చుట్టూ దీపాలు వెలిగించి తమ వారిని గుర్తు చేసుకుంటారు. తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి అక్కడ నైవేద్యం పెడతారు. అనంతరం సమాధుల వద్ద పూజలు చేస్తారు. ఆ తర్వాత టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. 

ఇదే కారణం..

కాగా, తమ పూర్వీకులు లేనిదే తాము లేమని.. అందుకే పూర్వీకులను స్మరించుకోవడమే నిజమైన దీపావళి అని వీరు చెబుతున్నారు. గత 60 ఏళ్లుగా ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. పండుగ రోజు వారిని స్మరించుకుంటూ శ్మశానంలో దీపావళి పండుగను జరుపుకొంటామని పేర్కొంటున్నారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా దీపావళికి ఇక్కడకు వచ్చి వేడుకలు చేసుకుంటారు. స్థానిక ప్రజలు సైతం వీరి విశ్వాసాన్ని గౌరవిస్తారు.

Also Read: Revanth Chit Chat Politics : చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Karnataka: కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ
Bagheera Review: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
Russia Google : రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !
రష్యాతో పెట్టుకుంటే అంతే - గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !
Embed widget