Aus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP Desm
ఆసీస్ ఉఫ్ మని ఊదేసింది. ప్రసిద్ధ్ కృష్ణ కిందా మీదా పడిన టార్గెట్ చిన్నది కావటంతో ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ ను గెలిచేసి..పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 141పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న టీమిండియా...మూడోరోజు ఉదయం 157పరుగులకే ఆలౌట్ అయిపోయింది. మొదటి ఇన్నింగ్ లో లభించిన 4పరుగుల లీడ్ తో కలిపి ఆస్ట్రేలియాకు 162పరుగుల టార్గెట్ మాత్రమే పెట్టగలిగారు మన బ్యాటర్లు. కెప్టెన్, స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మ్యాచ్ లో దిగకపోవటం భారత్ ను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన ఆస్ట్రేలియా..ఈ క్రమంలో 58పరుగులకే 3వికెట్లు కోల్పయినా ఎటాకింగ్ మాత్రం ఆపలేదు. ప్రసిద్ధ్ కృష్ణ 3వికెట్లు, సిరాజ్ 1 వికెట్ తీసినా...బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదే అడ్వాంటేజ్ గా హెడ్, వెబ్ స్టర్ చెలరేగిపోయి ఆడి ఆసీస్ కు కావాల్సిన లక్ష్యాన్ని చేధించారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఖాతాలో ఈ సిరీస్ లో మూడో విజయం పడి..3-1 తేడాతో పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరిసారిగా 2014-15 సీజన్ లో ఆస్ట్రేలియా జరిగిన టెస్ట్ సిరీస్ ను ధోని కెప్టెన్సీల ఇండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఇంటా బయటా ఆసీస్ ను చిత్తు చేసిన భారత్..వరుసగా నాలుగు సార్లు బీజీటీ సిరీస్ గెలుచుకున్నా...ఈ సారి ఓటమి తప్పలేదు.