Top Headlines Today: తెలంగాణ వేదికగా సీడబ్ల్యూసీ, చంద్రబాబు నిర్దోషిగా వస్తారని లోకేష్ ధీమా , ఎన్టీఆర్ ఎమోషన్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
తెలంగాణ వేదికగా సీడబ్ల్యూసీ భేటీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు హైదరాబాద్ నుంచి సమరశంఖం పూరిస్తున్నారు. రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జైల్ సూపరింటెండెంట్ భార్య మృతి
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతి చెందారు. కిరణ్మయి కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కిరణ్మయి కన్నుమూశారు. భార్యతకు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ రెండు రోజుల సెలవుపై వెళ్లారని తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అందరు విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం (Chief Minister’s Breakfast Scheme) ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అమిత్‌షా టూర్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆ రోజున జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆసక్తి పరిణామం చోటుచేసుకోనుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో అమిత్ షా భేటీ కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మర్యాదపూర్వకంగానే సింధును అమిత్ షా కలవనున్నారని వెల్లడించాయి. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సింధును అమిత్ షా కోరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. క్రీడా రంగంలో పీవీ సింధుకు మంచి పాపులారిటీ ఉంది. దేశం తరపున వివిధ టోర్నీలలో ఎన్నో పతకాలు సాధించింది. తెలుగు రాష్ట్రంలో పీసీ సింధు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. తమ పార్టీ కోసం సింధు మద్దతు కోరే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రభుత్వంలో లోకేష్ విమర్శలు
విజయవాడ పలు కళాశాలల్లో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్న విజయవాడ విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అన్నారు. జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం, తరగతులు సస్పెండ్ చేయించి, కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం అన్నారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో పాలకులారా అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బెయిల్ మంజూరు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల పన్నుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేఆర్ సూర్యనారాయణ, సహోద్యోగులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగం మోపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భారత్‌కు భంగపాటు
ఆసియా కప్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సైమాలో ఆర్‌ఆర్‌ఆర్ సత్తా
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి (RRR Movie) సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) పట్టం కట్టింది. ఈ ఏడాది సైమా వేడుకలో దుబాయ్ (Dubai)లో జరిగాయి. తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. అందులో 'ఆర్ఆర్ఆర్' సినిమా హవా కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎన్టీఆర్ ఎమోషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి అభిమానుల మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ గురించి ఆయన మాట్లాడిన ఒక్కో మాట గుండె లోతుల్లోంచి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన దుబాయ్ (Dubai)లో ఉన్నారు. సైమా 2023 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రతిక, యావర్ మధ్యలో పల్లవిప్రశాంత్
బిగ్ బాస్ సీజన్ 7లో అసలు లవ్ యాంగిల్ అనేది ఏ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య ఉంది అనే విషయం ఇంకా ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగానే ముందుగా రతిక, పల్లవి ప్రశాంత్‌ల మధ్య ప్రేమ చిగురించింది అన్నట్టుగా ప్రవర్తించారు. పల్లవి ప్రశాంత్ చూపిస్తున్న ప్రేమ.. రతికకు కూడా ఇష్టమే అన్నట్టుగా ప్రవర్తించినా.. ఒక్కసారిగా తాజాగా జరిగిన నామనేషన్స్‌లో ప్రశాంత్ మీద రివర్స్ అయ్యి అందరినీ షాక్‌కు గురిచేసింది. రెండోవారం నామినేషన్స్ తర్వాత నుండి రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య మాటలు లేవు. ఇక తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రతిక, ప్రిన్స్ యావర్ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి