SIIMA Awards 2023 : బెస్ట్ యాక్టర్ ఎన్టీఆరే, 'ఆర్ఆర్ఆర్'కు అవార్డుల పంట - సైమా 2023 విజేతల లిస్టు!
SIIMA Awards Winners List : దుబాయ్ లో శుక్రవారం రాత్రి సైమా అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. 'ఆర్ఆర్ఆర్'కు ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఇంకా ఎవరెవరికి అవార్డులు వచ్చాయంటే?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి (RRR Movie) సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) పట్టం కట్టింది. ఈ ఏడాది సైమా వేడుకలో దుబాయ్ (Dubai)లో జరిగాయి. తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. అందులో 'ఆర్ఆర్ఆర్' సినిమా హవా కనిపించింది.
ఉత్తమ నటుడు ఎన్టీఆరే...
'ఆర్ఆర్ఆర్'కు ఇంకా అవార్డులు!
ప్రేక్షకులు ముందుగా ఊహించినట్లు 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఇంకా దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ అవార్డులు అందుకున్నారు. సైమా 2023లో అత్యధిక అవార్డులు అందుకున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' అని చెప్పవచ్చు. రాజమౌళి కుటుంబం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాలేదు. రాజమౌళి అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా... కీరవాణి అవార్డును చంద్రబోస్ అందుకున్నారు. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
సైమా 2023 విజేతల వివరాలు
- ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ నటి - శ్రీ లీల (ధమాకా సినిమా)
- ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ సినిమా - సీతా రామం (వైజయంతి మూవీస్ అశ్వినీదత్, స్వప్న సినిమా)
- ఉత్తమ సంగీత దర్శకుడు - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ ఛాయాగ్రాహకుడు - కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ సాహిత్యం - చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - అడివి శేష్ (మేజర్ సినిమా)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - వశిష్ఠ (బింబిసార సినిమా)
- బెస్ట్ డెబ్యూ (హీరో) - అశోక్ గల్లా (హీరో సినిమా)
- బెస్ట్ డెబ్యూ (హీరోయిన్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
- బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడ్యూసర్స్ - శరత్ & అనురాగ్ (మేజర్ సినిమా)
- సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ - కార్తికేయ 2
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్ సినిమా)
- ఉత్తమ సహాయ నటి - సంగీత (మాసూద సినిమా)
- ఉత్తమ విలన్ - సుహాస్ (హిట్ 2 సినిమా)
- ఉత్తమ హాస్యనటుడు - శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2 సినిమా)
- ఫ్యాషన్ యూత్ ఐకాన్ - శృతి హాసన్!
- ప్రామిసింగ్ స్టార్ - బెల్లంకొండ గణేష్!
Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
గాయని గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ సైతం పురస్కారాలు అందుకున్నారు. ఈ అవార్డు వేడుకలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. మొదటి సినిమాకు, అలాగే క్రిటిక్స్ ఛాయిస్... కథానాయికగా 'సీతా రామం' చిత్రానికి ఆమె రెండు అవార్డులు అందుకున్నారు. తెలుగమ్మాయి, రాజశేఖర్ & జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని సైతం నృత్య ప్రదర్శనతో అలరించారు. కన్నడ అవార్డుల్లో రిషబ్ శెట్టి 'కాంతార'కు ఎక్కువ అవార్డులు వచ్చాయి. దక్షిణాది సినిమా ప్రముఖుల సందడితో దుబాయ్ కళకళలాడుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial