అన్వేషించండి

CM Breakfast Scheme: స్కూల్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, ఉత్తర్వులు జారీ

CM Breakfast Scheme: ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని అందరు విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం (Chief Minister’s Breakfast Scheme) ప్రకటించారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ సర్కార్ విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు మంచి విద్యా బోధనతో పాటు పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 1 నుంచి 10వ తరగతుల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి పోషకారంగా ఉదయం అల్పాహారం లభించనుంది.  సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను శుక్రవారం రాత్రి జారీ చేసింది.
 
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లభించడంతో వారు ఆకలి బాధ, సమస్యలు లేకుండా చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది సర్కార్. ఉదయాన్నే వ్యవసాయం పనులు, కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఈ అల్పాహార పథకాన్ని ప్రకటించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది.

తమిళనాడుకు వెళ్లిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల టీమ్..
తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని (విద్యార్థులకు అల్పాహార పథకం) పరిశీలించి రావాలని సీఎం కేసీఆర్ ఐఎఎస్ అధికారుల బృందాన్ని ఇటీవల అక్కడికి పంపించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న "విద్యార్థులకు అల్పాహారం" పథకాన్ని అధ్యయనం చేసిన ఐఏఎస్ అధికారుల బృందం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. 
విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం కేసీఆర్,  ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు (6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు) కూడా బ్రేక్ ఫాస్టును అందచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో  వెళ్లిపోయిన కమిషనర్
గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన
AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి
Brezza vs Nexon: మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
మారుతి సుజుకి బ్రెజా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ధరలో ఏది బెస్ట్?
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
PM Surya Ghar Muft Bijli Yojana Online Apply: కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
కేంద్రం నుంచి ఉచిత విద్యుత్ పొందే పథకం గురించి తెలుసా? నెలకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా వస్తుంది!
Goli Shyamala: సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత
Embed widget