అన్వేషించండి

Nara Lokesh: స్కిల్ డెవలప్ మెంట్ లో స్కామ్ జరగలేదని నిరూపిస్తా - నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: విజయవాడ పలు కళాశాలల్లో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Nara Lokesh: విజయవాడ పలు కళాశాలల్లో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)వేదికగా ఆయన  జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా  శాంతియుతంగా ఆందోళన చేయాలనుకున్న విజయవాడ విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అన్నారు. జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం, తరగతులు సస్పెండ్ చేయించి, కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం అన్నారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో పాలకులారా అంటూ లోకేష్ ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించిందని ఆరోపించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చినట్టు తెలిపారు. అనినీతి పరులు నీతిపరులను జైలుకు పంపుతున్నారని, ‘స్కిల్‌ డెవలప్‌మెంట్’ అంశంలో అవినీతి నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని, ఎలాంటి స్కామ్‌ జరగలేదని తాను నిరూపించగలనని.. అందుకు వైసీపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. స్కిల్ డెవెలప్మెంట్‌లో అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తానని, అపరిమిత అధికారం అపరిమిత అవినీతికి దారి తీస్తుందని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికే తాను ఢిల్లీ వెళ్లినట్లు లోకేష్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపిందని, ఆయనకు జరిగిన అన్యాయన్ని దేశ ప్రజలకు వివరిస్తామన్నారు. జాతీయ స్థాయి నేతలు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలిపారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షతోనే బాబును అరెస్ట్ చేసిందని, రిమాండ్‌కు తరలించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాక్షాలను తారుమారు చేసిందని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పనిచేయాలని నిర్ణయించారని అన్నారు.

సీఐడీ చీప్ ఇప్పటి కూడా స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని కానీ, కుటుంబం సభ్యుల ఖాతాల్లో డబ్బు జమైనట్లు కానీ నిరూపించలేకపోయారని అన్నారు. ఎందుకుంటే  ఈ కేసులో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. న్యాయం జరగడం ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదన్నారు. చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని అన్నారు. అవినీతి రహిత నాయకుడికి చిరునామాగా నిలుస్తారని అన్నారు.

సుప్రీం కోర్టు న్యాయవాదులతో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన గురువారం ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేశ్ జతీయ మీడియాకు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

అంతేకాక, చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి కూడా నారా లోకేశ్ చర్చించనున్నారు. అటు పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం వేసింది. అందుకోసం చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేశ్ మాట్లాడనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhoodan Land Scam In Rangareddy: భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
భూదాన్ లాండ్ స్కామ్‌లో భారీ ట్విస్ట్‌- మాజీ ఎమ్మెల్యే, రియల్‌ఎస్టేట్ సంస్థ ఎండీకి నోటీసులు
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Meenu Song Promo : వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
వెంకీ మామ బర్త్ డే స్పెషల్ 'మీనూ' సాంగ్ ప్రోమో వచ్చేసింది... స్వీట్ సర్ప్రైజ్​తో బర్త్ డే విషెస్
Bomb threats to RBI: ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
ముంబైలోని ఆర్బీఐ ఆఫీస్‌కి బాంబు బెదిరింపు- జర్మనీ భాషలో ఈమెయిల్ చేసిన ఆగంతకులు
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Embed widget