By: ABP Desam | Updated at : 16 Sep 2023 12:00 AM (IST)
Image Credit: Star Maa, Disney Hotstar
బిగ్ బాస్ సీజన్ 7లో అసలు లవ్ యాంగిల్ అనేది ఏ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య ఉంది అనే విషయం ఇంకా ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగానే ముందుగా రతిక, పల్లవి ప్రశాంత్‌ల మధ్య ప్రేమ చిగురించింది అన్నట్టుగా ప్రవర్తించారు. పల్లవి ప్రశాంత్ చూపిస్తున్న ప్రేమ.. రతికకు కూడా ఇష్టమే అన్నట్టుగా ప్రవర్తించినా.. ఒక్కసారిగా తాజాగా జరిగిన నామనేషన్స్‌లో ప్రశాంత్ మీద రివర్స్ అయ్యి అందరినీ షాక్‌కు గురిచేసింది. రెండోవారం నామినేషన్స్ తర్వాత నుండి రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య మాటలు లేవు. ఇక తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రతిక, ప్రిన్స్ యావర్ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు.
యావరే అర్హుడు అన్న రతిక..
నిన్నటి వరకు ప్రిన్స్ యావర్ చేతిలో మాయాస్త్రం ఉంది. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత అంతా రివర్స్ అయ్యింది. ఒకసారిగా తన చేతిలో ఉన్న మాయాస్త్రం.. శివాజీ చేతిలోకి వెళ్లింది. అది గౌతమ్ వల్లే జరిగిందని యావర్‌కు, తనకు వాగ్వాదం కూడా జరిగింది. ఒకవైపు ఈ వాగ్వాదం జరుగుతుండగానే.. ‘నేను ప్రిన్స్, శివాజీ అన్న అర్హులు అన్నాను. నా మాట ఎవరు వినలేదు’ అంటూ రతిక.. తన వర్షన్ వినిపించడం మొదలుపెట్టింది. ప్రిన్స్ అర్హుడు అంటూ తన టీమ్ మెంబర్స్‌పైనే అరవడం మొదలుపెట్టింది. ‘నేను నీతో కూడా అన్నాను కదా యావర్ అర్హుడు అని’ అంటూ శుభశ్రీని అడగగా.. ‘నువ్వేం చెప్పావో నాకు గుర్తులేదు’ అంటూ శుభశ్రీ.. రతికను పట్టించుకోలేదు. ‘షకీలా కంటే యావర్ అర్హుడు’ అంటూ షకీలా గురించి అమర్యాదగా మాట్లాడింది. ఆ తర్వాత వెళ్లి కాళ్లు పట్టుకొని క్షమాపణ కూడా అడిగింది. అయితే రతిక.. తన గురించి మాట్లాడింది అన్న ఉద్దేశ్యంతో యావర్‌కు ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది.
ఐ లైక్ యూ..
మాయాస్త్రం గురించి వాగ్వాదాలు అన్ని ముగిసిన తర్వాత రతిక, యావర్ ప్రేమగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘బిగ్ బాస్ నేను రతిను ఇష్టపడుతున్నాను’ అంటూ రతికకు ఐ లైక్ యూ కూడా చెప్పాడు యావర్. దానికి ‘ఐ లైక్ యూ టూ’ అంటూ సమాధానం కూడా ఇచ్చింది రతిక. ఆ తర్వాత ‘నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది’ అన్నట్టుగా సైగ చేసి చూపించాడు యావర్. ఇదంతా పల్లవి ప్రశాంత్ దగ్గర ఉండి గమనించాడు. యావర్, పల్లవి ప్రశాంత్ మాత్రమే ఉన్నప్పుడు ‘నీకు రతిక అంటే ఇష్టం కదా’ అని యావర్‌ను ప్రశ్నించాడు ప్రశాంత్. ‘అంటే తనకు మంచి మనసు ఉందని నాకు అనిపిస్తుంది’ అంటూ సమాధానమిచ్చాడు యావర్. ‘అదంతా నమ్మకు రా నాయనా’ అంటూ యావర్‌కు సలహా ఇచ్చాడు ప్రశాంత్.
మనస్పర్థలు తొలగిపోయినట్టేనా..?
రెండోవారం నామినేషన్స్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా పల్లవి ప్రశాంత్ ప్రవర్తనను తప్పుబట్టి నామినేట్ చేస్తున్నప్పుడు రతిక కూడా వారిని సపోర్ట్ చేసింది. దీంతో అప్పటివరకు స్నేహంగా ఉన్న రతిక, ప్రశాంత్ మాట్లాడుకోవడం మానేశారు. నేడు (సెప్టెంబర్ 15న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో వారి మధ్య ఉన్న మనస్ఫర్థలు తొలగించుకోవాలని ప్రశాంత్ ఫిక్స్ అయ్యాడు. అందుకే రతిక దగ్గరకు వెళ్లి సమస్య ఏంటని కనుక్కున్నాడు. ‘కొన్ని విషయాల్లో నువ్వు ఓవర్ చేశావు. అలా చేయొద్దు’ అంటూ ప్రశాంత్ తనను ఉద్దేశించి చేసిన విషయాల గురించి తనకు గుర్తుచేసింది రతికజ ‘సరే ఇంకెప్పుడూ అలా చేయను’ అంటూ ప్రశాంత్ కూడా ఒప్పుకున్నాడు. ఈ సంభాషణ అంతా యావర్ ముందే జరిగింది.
Also Read: యావర్, గౌతమ్ మధ్య ఇంజెక్షన్ గొడవ - అందులో నిజమెంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
Bigg Boss Season 7 Telugu: తేజకు జైలు శిక్ష - కంటెస్టెంట్స్ అంతా కలిసి నిర్ణయం, నామినేషన్స్ విషయంలో కూడా ఎదురుదెబ్బ
Bigg Boss Season 7 Latest Promo: డైరెక్ట్ ఇంటికి పంపించేయడం బెటర్ - నాగార్జున ముందే తేజపై సందీప్ వ్యాఖ్యలు
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>