Indian Citizenship: భారత పౌరసత్వానికి ఐదేళ్లలో 6 లక్షల మంది టాటా!
2015 నుంచి 2019 మధ్య ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
గత ఐదేళ్లలో ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 1,33,83,718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని ఆయన తెలిపారు. కొత్తగా 4,177 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు వెల్లడించారు.
2015 నుంచి 2019 మధ్య వీరంతా తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు నిత్యానంద్ రాయ్ తెలిపారు.
2015లో 1,41,656 మంది, 2016లో 1,44,942 మంది, 2017లో 1,27,905 మంది, 2018లో 1,25,130 మంది, 2019లో 1,36,441 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.
సీఏఏ చట్టం..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ చట్టం వల్ల భారత్‌కు చెందిన కొంతమంది పౌరుల్లో ఆందోళన నెలకొందని ఇటీవల సర్వేలో తేలింది.
2014 డిసెంబర్ 31కి ముందు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలకు పౌరసత్వం ఇవ్వాలని పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం. అయితే దీని వల్ల అసోంకు వచ్చిన చాలా మందికి పౌరసత్వం లభిస్తుందని, ఆ కారణంగా రాష్ట్ర జనాభా స్వరూపమే మారిపోతుందని ఆరోపిస్తూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..
Also Read: Omicron Scare: 'ఒమిక్రాన్'పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఇవి తప్పనిసరి!
Also Read: 12 MP Suspension: ఎంపీల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని వెంకయ్య.. విపక్షాలు వాకౌట్
Also Read: Omicron Variant: 'ఒమ్రికాన్'పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
Also Read: New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి