12 MP Suspension: ఎంపీల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని వెంకయ్య.. విపక్షాలు వాకౌట్
12 మంది ఎంపీల సస్పెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 12 విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు ససేమిరా అన్నారు. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Delhi | Opposition leaders protest at Mahatma Gandhi statue in Parliament premises over suspension of 12 MPs.
— ANI (@ANI) November 30, 2021
Opposition MPs staged walkout from Lok Sabha and Rajya Sabha after Rajya Sabha Chairman M Venkaiah Naidu rejected revocation of the suspension of 12 Opposition MPs. pic.twitter.com/t8T7XmDFKY
లోక్‌సభలో కూడా..
లోక్‌సభలో కూడా కాంగ్రెస్, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం నిరసనలో పాల్గొనలేదు, వాకౌట్ కూడా చేయలేదు.
విపక్షాలు వాకౌట్ చేయడంతో రాజ్యసభ, లోక్‌సభను రేపటి వరకు వాయిదా వేశారు.
అన్యాయంగా..
12 మంది విపక్ష ఎంపీలను రూల్స్‌కు విరుద్ధంగా, అన్యాయంగా సస్పెండ్ చేశారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
వెనక్కి తగ్గని వెంకయ్య..
12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విషయంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభ్యులు గత సమావేశాల్లో సభలో విధ్వంసం సృష్టించారన్నారు. అందుకే వారిని సస్పెండ్ చేశామన్నారు.
Also Read: Omicron Variant: 'ఒమ్రికాన్'పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
Also Read: New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి