Bihar Special Status : మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ లేవనెత్తుతున్న నితీష్ కుమార్... పరిశీలిస్తామన్న నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ వ్యాఖ్యలతో కలకలం !
బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని బీహార్ సీఎం లేఖ రాశారు. పరిశీలిస్తామని నీతిఆయోగ్ వైస్‌చైర్మన్ స్పందించారు. దీంతో హోదా ఆశిస్తున్న ఇతర రాష్ట్రాల్లోనూ కలకలం ప్రారంభమమయింది.
![Bihar Special Status : మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ లేవనెత్తుతున్న నితీష్ కుమార్... పరిశీలిస్తామన్న నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ వ్యాఖ్యలతో కలకలం ! Niti Aayog Will Closely Examine Bihar Justification on Special Status Demand says rajiv kumar Bihar Special Status : మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ లేవనెత్తుతున్న నితీష్ కుమార్... పరిశీలిస్తామన్న నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ వ్యాఖ్యలతో కలకలం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/01/5d07d89f91610eaf564471dbe76f16ec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రకటించడం కలకలం రేపుతోంది. ప్రత్యేకహోదా అనే అంశం ముగిసిపోయిన అధ్యాయమని దేశంలో ఇక ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని స్వయంగా పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని హామీ ఇచ్చినా నెరవేరలేదు. అదే సమయంలో బీహార్‌కు ప్రత్యేకహోదా కోసం పదేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కేంద్రం బీహార్‌కే కాదు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. వివిధ రకాల కారణాలు చెప్పి.. హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పటికీ పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం నిర్మోహమాటంగా చెబుతూ ఉంటుంది.
అయితే హఠాత్తుగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తామని ప్రకటించారు. దీంతో హోదా ఆశిస్తున్న రాష్ట్రాల్లోనూ చర్చ ప్రారంభమయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను మళ్లీ వినిపించడం ప్రారంభించారు. మూడు రోజుల కిందట ఆయన నీతి ఆయోగ్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నా... అనుకున్న విధంగా రాష్ట్రం పుంజుకోలేకపోయిందని ప్రత్యేకహోదా ఉంటేనే పుంజుకుంటామని లేఖ రాశారు. ఈ లేఖపైనే రాజీవ్ కుమార్ స్పందించారు.
Also Read: షీనా బోరా బతికే ఉందట.. ఏళ్ల తర్వాత ట్విస్ట్ ఇస్తున్న ఇంద్రాణి !
గత పదేళ్లలో బీహార్ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే అంతకు ముందు ఉన్న పరిస్థితుల వల్ల కోలుకోలేకపోయిందన్నారు. అందుకే ప్రత్యేకహోదా ఇచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్నప్పుడల్లా నితీష్ కుమార్ బీహార్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తెస్తూంటారన్న విశ్లేషణలు ఉన్నాయి.
Also Read: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
ప్రస్తుతం బీహార్‌లో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న జేడీయూ ,మైనర్ భాగస్వామి. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఈ క్రమంలో బీజేపీ డామినేషన్ ఎక్కువగా ఉండటంతో ఆయన బీజేపీని కంట్రోల్‌లో పెట్టడానికి హోదా అంశం లేవనెత్తుతున్నారని కూడా భావిస్తున్నారు. అయితే నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ మంత్రులు వెంటనే ఖండిస్తున్నారు. కేంద్రం కావాల్సినంత సాయం చేస్తోందని ప్రత్యేకహోదా అవసరం లేదని చెబుతున్నారు. దీంతో నితీష్ కుమార్ వారిపైనా విమర్శలు చేస్తున్నారు.
Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)