Muzaffarnagar: పాఠశాలలో పాడు పని.. ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!
ఉత్తర్‌ప్రదేశ్ ముజాఫర్ నగర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికలపై పాఠశాల సిబ్బందే లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఇంతకంటే దారుణం ఉంటుందా..? చదువు నేర్పాల్సిన పాఠశాలలో అకృత్యమా? అన్యంపున్యం ఎరుగని బాలికలపై అఘాయిత్యమా? డ్రగ్స్ ఇచ్చి మరీ బాలికలపై లైంగిక దాడి..! అవును.. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందో తెలుసా?
దారుణం..
నవంబర్ 17న ముజాఫర్‌నగర్‌లోని పుర్కాజీ టౌన్ స్కూల్ సిబ్బంది. జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద 17 మంది బాలికలను ఇంటికి వెళ్లకుండా ఆపు చేశారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో వీరిని ఆ రోజు రాత్రి పాఠశాలలోనే ఉండాలని చెప్పారు. అయితే ఆ సమయంలో ఒక్క మహిళా సిబ్బంది, టీచర్ కూడా లేరు. పక్కా ప్లాన్‌తో బాలికలకు ఇచ్చిన ఆహారంలో డ్రగ్స్ కలిపి తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు సిబ్బంది. ఆ తర్వాతి రోజు ఉదయం బాలికలను ఇంటికి పంపించారు.
చెప్తే చంపేస్తాం..
ఈ విషయం బయటకు చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని, తమ తల్లిందండ్రులను చంపేస్తామని సిబ్బంది బెదిరించినట్లు బాలికలు వాపోయారు. కళ్లనీళ్లు పెట్టుకుని తల్లిదండ్రులకు జరిగింది చెప్పుకున్నారు. అయితే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని తప్పించేందుకు ప్రయత్నించారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్తే తప్పుడు కేసులు పెడతామని స్థానిక జర్నలిస్టును కూడా పోలీసులు బెదిరించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే చొరవతో..
ఘటన జరిగిన 17 రోజుల తర్వాత స్థానిక భాజపా ఎమ్మెల్యే చొరవ చూపడంతో విషయం బయటకు వచ్చింది. ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్.. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశించారు.
షాకింగ్ నిజాలు..
ఘటన జరిగిన తర్వాతి రోజు బాలికలు ఎవరూ పాఠశాలకు వెళ్లలేదని.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై పోలీసులు పోక్సో సహా ఐపీసీలో సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుర్య దేవ్ పబ్లిక్ స్కూల్ ఆపరేటర్ యోగేశ్ కుమార్, జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపరేటర్ అర్జున్ సింగ్ పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అలానే పిల్లల తల్లిదండ్రులు చెప్పినా కేసు నమోదు చేయకుండా ఉన్న పోలీసు అధికారిపై వేటు వేశారు.
Also Read: Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు
Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి