Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ టాప్-5లో చోటుదక్కించుకుంది.
![Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు Asia Power Index 2021 India Ranked 4th Most Powerful Country Behind China In Indo-Pacific Region Asia Power Index: రష్యాను దాటిన భారత్.. అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో @4వ ర్యాంకు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/14/262f6c3f4031d5fb2d0f0d3207325e2c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. లోవీ ఇన్‌స్టిట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ 2021లో భాగంగా వనరులు వాటి ప్రభావం ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు నిర్ణయించారు. అయితే 2020లో కంటే భారత్ స్కోరు 2 పాయింట్లు తగ్గింది. 100కు 37.7 పాయింట్లు దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న దేశాల్లో వనరులు వాటి ప్రభావం ఆధారంగా లోవీ ఇన్‌స్టిట్యూట్.. ఆసియా పవర్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. 2018 నుంచి ప్రతి ఏడాది ఈ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది.
భారత్ సత్తా..
భవిష్యత్ వనరుల కొలతలో భారత్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని ఈ నివేదిక ప్రకారం తేలింది. అయితే అమెరికా, చైనా కంటే భారత్ వెనుకబడి ఉంది. కరోనా సంక్షోభం వల్ల వృద్ధి సామర్థ్యాన్ని అందుకోవడంలో భారత్ విఫలమైందని నివేదిక చెప్పింది. అయితే ఆర్థిక, సైనిక సామర్థ్యం, స్థితిస్థాపకత, సాంస్కృతిక ప్రభావంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటింది.
ఇంకా..
- మరోవైపు భారత్ ప్రాంతీయ సైనిక విధానాల్లో పురోగతిని కనబరుస్తోంది.
- మిలటరీ నెట్‌వర్క్‌లో భారత్ 7వ స్థానంలో కొనసాగుతోంది.
- ప్రాంతీయ వాణిజ్య ఏకీకరణ ప్రయత్నాలలో మరింత వెనుకబడి ఉన్నందున, ఆర్థిక సంబంధాలలో భారతదేశం ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
- అందుబాటులో ఉన్న వనరులను బట్టి భారత్ ఈ ప్రాంతంలో ఊహించిన దాని కంటే తక్కువ ప్రభావాన్ని చూపుతుందని నివేదిక పేర్కొంది.
- ఈ నివేదికలో 82.2 పాయింట్లతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, 74.6 పాయింట్లతో చైనా రెండో స్థానంలో ఉంది.
టాప్-10
- అమెరికా
- చైనా
- జపాన్
- భారత్
- రష్యా
- ఆస్ట్రేలియా
- దక్షిణ కొరియా
- సింగపూర్
- ఇండోనేసియా
- థాయ్‌లాండ్
Also Read: Corona Cases: తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)