అన్వేషించండి

Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 

Raghav Chadha: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాఘవ్ చద్దా వినియోగదారులు కొన్న డేటా వృథాపై రాజ్యసభలో ప్రస్తావించారు.
  • రోజువారీ డేటా మిగిలిపోతే, అది రద్దు కాకుండా మరుసటి రోజుకు కలపాలి.
  • మిగిలిన డేటా విలువను తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయాలని కోరారు.
  • స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డేటాను బదిలీ చేసుకునే అవకాశం కల్పించాలి.

Raghav Chadha: నేటి ఆధునిక యుగంలో మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో, ఇంటర్నెట్ కూడా అంతే అవసరం. అయితే వినియోగదారులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్‌ డేటా, నిర్ణీత గడువులోగా వాడకపోతే వృథాగా పోతుంది. దీనిపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతూ టెలికాం కంపెనీల ప్రస్తుత విధానాల్లో మార్పులు రావాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. 

డబ్బు కడుతున్నాం కానీ డేటా మాయమవుతోంది!

ప్రస్తుతం టెలికాం రంగంలో ఉన్న అతి పెద్ద లోపాన్ని రాఘవ్ చద్దా సభ దృష్టికి తీసుకొచ్చారు. వినియోగదారులు ప్రతిరోజూ నిర్దిష్ట డేటా పరిమితి కోసం ముందుగానే డబ్బులు చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారు రోజుకు 2జీబీ డేటా ప్లాన్ తీసుకుంటే,, అందులో కేవలం 1.5 జీడీ మాత్రమే వాడితే, మిగిలిన 0.5జీ డేటా అర్థరాత్రి దాటగానే ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారుడు ఇప్పటికే ఆ జేటా కోసం డబ్బు చెల్లించాడు. అలాంటప్పుడు అది వృథా కావడం లేదా వెనక్కి తీసుకోవడం బాగా లేదు అని చద్దా స్పష్టం చేశారు. 

ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న పొరపాటు కాదని, టెలికాం కంపెనీలు కావాలనే అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానమని ఆయన మండిపడ్డారు. దీని వల్ల వినియోగదారులు తాము పూర్తిగా వాడుకోలేని సామర్థ్యం కోసం పదే పదే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన మూడు కీలక సంస్కరణలు 

టెలికాం వినియోగదారుల హక్కులను కాపాడేందుకు రాఘవ చద్దా ప్రధానంగా మూడు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 

డేటా క్వారీ- ఫార్వర్డ్‌ విధానం: ప్రస్తుత పద్ధతిలో మిగిలిపోయిన డేటా మరుసటి రోజుకు కలవదు. అలా కాకుండా ఒక రోజు మిగిలిపోయన డేటాను మరుసటి రోజు కోటాకు జోడించలా అన్ని టెలికాం సంస్థలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని వల్ల వినియోగదారులు తాము కొనుగోలు చేసిన ప్రతి డేటాను సద్వినియోగం చేసుకోనే వీలు ఉంటుంది. 

తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు :  కొంతమంది వినియోగదారులు నిరంతరం తమ డేటా పూర్తిగా వాడలేపోతుంటారు. అటువంటి వారి విషంలో, నెల చివరన మిగిలిపోయిన డేటాను లెక్కించి, దాని విలువను బట్టి తదుపరి నెల రీఛార్జ్ మొత్తం తగ్గింపు ఇవ్వాలని చద్దా ప్రతిపాదించారు. ఇది వినియోగదారుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అన్నారు. 

డేటా బదిలీ అవకాశం: డేటాను వినియోగదారుడి డిజిటల్‌ ఆస్తిగా భావించాలని రాఘవ్ చద్దా ఒక వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. మనం బ్యాంకు నుంచి డబ్బులను ఇతరులకు పంపినట్టుగానే మన దగ్గర మిగిలిపోయిన డేటాను స్నేహితులకు, లేదా బంధువులకు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలని కోరారు. 

డిజిట్ ఇండియా దిశగా మరో అడుగు 

భారత్‌ డిజిటల్ ఇండియా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టైంలో డిజిటల్‌ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలని అదే సమయంలో అవి పారదర్శకంగా ఉండాలని చద్దా పేర్కొన్నారు. మీరు ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే అది మీ ఆస్తి అవుతుంది. అది వాడినా వాడకపోయినా మీకే చెందాలి. డేటా విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించాలి అన్నారు. 

కేవలం డేటా మాయమైపోవడం వల్ల టెలికాం కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలను గడిస్తున్నాయని, ఇది వినియోగదారులను వంచించడమేనని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని, వినియోగదారులకు అనుకూలమైన టెలికాం విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభలో పేర్కొన్నారు. 

Frequently Asked Questions

వినియోగదారులు డబ్బులు చెల్లించిన మొబైల్ డేటా ఎందుకు వృధా అవుతుంది?

ప్రస్తుతం టెలికాం కంపెనీల విధానాల ప్రకారం, రోజువారీ డేటా పరిమితిని ఉపయోగించకపోతే, అర్థరాత్రి దాటిన తర్వాత ఆ డేటా ఎక్స్‌పైర్ అయిపోతుంది. వినియోగదారులు ఇప్పటికే ఆ డేటా కోసం డబ్బు చెల్లించినప్పటికీ, అది వృధా అవుతుంది.

రాఘవ్ చద్దా ప్రతిపాదించిన ముఖ్యమైన సంస్కరణలు ఏమిటి?

మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు బదిలీ చేయడం (డేటా క్వారీ- ఫార్వర్డ్), మిగిలిపోయిన డేటా విలువను తదుపరి రీఛార్జ్‌లో సర్దుబాటు చేయడం, మరియు డేటాను స్నేహితులు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించడం ఆయన ప్రతిపాదనలలో ఉన్నాయి.

డేటా బదిలీ అవకాశం వినియోగదారులకు ఎలా సహాయపడుతుంది?

డేటాను వినియోగదారుడి డిజిటల్ ఆస్తిగా పరిగణించి, బ్యాంకు లావాదేవీల మాదిరిగా స్నేహితులకు లేదా బంధువులకు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తే, వినియోగదారులు తమ డేటాను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

డేటా వృధా అవ్వడం వల్ల టెలికాం కంపెనీలకు ఎలా లాభం చేకూరుతుంది?

వినియోగదారులు పూర్తిగా ఉపయోగించుకోలేని డేటా కోసం పదేపదే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల టెలికాం కంపెనీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నాయి, ఇది వినియోగదారులను వంచించడమే అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget