అన్వేషించండి

Nashik TCS Case: టీసీఎస్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్ అరెస్టు.. ఫ్యామిలీతో కలిసి ఫ్లాట్‌లో దాక్కున్న నిందితురాలు

TCS మత మార్పిడి కేసు దర్యాప్తులో నాసిక్ పోలీసులు పురోగతి సాధించారు. పరారీలో ఉన్న నిందితురాలు నిదా ఖాన్‌ను అరెస్టు చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఫ్లాట్‌లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Nashik TCS Case | నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపులు, మానసిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మత మార్పిడుల కేసులో పరారీలో ఉన్న నిందితురాలు నిదా ఖాన్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నాసిక్ క్రైమ్ బ్రాంచ్, ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, సంస్థలో మత మార్పిడులు, ప్రమోషన్ల విషయంలో మతపరమైన వేధింపుల విషయం వెలుగులోకి రావడంతో మార్చి 25 నుంచి పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం నాసిక్ పోలీసుల రెండు బృందాలుగా ఏర్పడి నిరంతరం శ్రమించాయి. చివరకు ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లోని నారేగావ్ పరిధిలోని కైసర్ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబంతో కలిసి ఫ్లాట్‌లో నిందితురాలు
ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఆ ఫ్లాట్‌లో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌తో పాటు ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, పిన్ని సహా మొత్తం ఐదుగురు నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన తరువాత నిదా ఖాన్‌ను గురువారం (మే 7న) రాత్రి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో ఆమెపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. 

నిదా ఖాన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
అంతకుముందు స్థానిక కోర్టు నిందితురాలు నిదా ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దాంతో కోర్టు నిదా ఖాన్ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఏప్రిల్ 20న నిదా ఖాన్‌కు మధ్యంతర రక్షణ కల్పించేందుకు కూడా కోర్టు నిరాకరించడం తెలిసిందే

ఈ కేసులో నిదా ఖాన్ కంటే ముందే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో మొత్తం 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒక కేసు దేవ్‌లాలీ క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో నమోదు కాగా, మిగిలినవి ముంబై నాకాలో రిజిస్టర్ అయ్యాయి. టీసీఎస్ కేసులో ప్రధాన నిందితులుగా సైఫీ షేక్, రజా మెమన్ ఉన్నారు.

టీసీఎస్ కేసుపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫోకస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసును అత్యంత తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై విచారణ జరుపుతోందని, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. టెక్ హబ్‌ టీసీఎస్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ప్రజల మతపరమైన భావాలను ఎవరు దెబ్బతీస్తున్నారో తెలుసుకోవడానికి రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేస్తున్నాయని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
మధ్యాహ్నం 2 గంటల వరకు పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget