అన్వేషించండి

Nashik BPO Scandal: TCSలో పనివాళ్లుగా పోలీసులు.. అండర్ కవర్ ఆపరేషన్..'కార్పోరేట్ జిహాద్'లో కొత్త కోణం..!

నాసిక్  TCS BPOలో  కార్పోరేట్ జిహాద్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇందులో కొత్త విషయం ఏంటంటే ఈ కేసులో నిజాలు నిర్థారించుకోవడానికి పోలీసులు హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేశారు.

Nashik TCS BPO Case: మహరాష్ట్రని కుదిపేసిన  నాసిక్ BPO లైంగిక వేధింపుల అంశంలో పోలీసులు చాలా పక్కాగా వ్యవహరించారు. దాదాపు 150మంది వరకూ పనిచేస్తున్న ఆ BPOలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో నిజాన్ని నిర్ఖారించుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్  చేశారు. కొన్ని రోజులు అక్కడ పనిచేసి నిజాలు నిర్థారించుకున్న తర్వాతే FIRలు నమోదు చేశారు. 

నాసిక్ TCS BPOలో లైంగిక వేధింపులు 

మహరాష్ట్ర నాసిక్‌లోని TCS BPOలో మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఉద్యోగ ప్రలోభాలు, మతపరమైన ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు రావడం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో  ఇప్పటికే 9FIRలు నమోదు కాగా ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఎక్కువ మంది ఓ మతానికి చెందిన వారుండటం, వారు బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించారన్న ఫిర్యాదు రావడంతో విషయం సున్నితంగా మారింది. రైట్ వింగ్ రాజకీయ పార్టీలు ఇది లవ్‌జిహాద్‌లాగా కార్పోరేట్ జిహాద్ అని అభివర్ణించాయి. బలవంతపు మతమార్పిడిలకు కార్పోరేట్ ఆఫీసులను కూడా ఉపయోగిస్తన్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ వ్యవహారం ముందుగా బయటకు వచ్చినప్పుడు.. విషయం సెన్సిటివ్ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ముందుగా విషయాన్ని నిర్థారించుకున్న తర్వాతనే యాక్షన్‌లోకి దిగారు.

నాసిక్ పోలీసుల అండర్ కవర్ -TCSలో హౌస్ కీపింగ్ 

అసలు ఈ విషయంలో ఎప్పుడు బయటకు వచ్చిందంటే..TCS అనుబంధ BPOలో పనిచేసే ఓ 20 ఏళ్ల హిందూ అమ్మాయి.. అక్కడ చేరిన కొన్నిరోజులకు తన మతపరమైన ఆచార వ్యవహరాలను మార్చుకుంది. ఆహార్యం, తన మతపరమైన గుర్తింపును మార్చుకునేందుకు ప్రయత్నించడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. ఆఫీసులోనే ఏదో జరుగుతోందని ఈ ఫిభ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌  చాలా పేరున్న MNC కంపెనీ.. ఆ సంస్థలో వ్యవహారం కావడం.. విషయం చాలా సున్నితమైంది కావడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. అనుమానాన్ని నిర్ఖారించుకునేందుకు TCSలో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా కొంతమంది కానిస్టేబుళ్లు చేరారు. ఇందులో ఒకరిద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు 15 రోజులు అక్కడ నిఘా ఉంచి జరుగుతున్నది నిజమే అని నిర్థారించుకున్నారు.

మార్చిలో మొదటి ఫిర్యాదు

2026 మార్చి 25న ఒక మహిళా ఉద్యోగి Deolali  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను  2022 నుంచి 2026 వరకూ సహచరుల చేత లైంగిక దోపిడీ, మతపరమైన వేధింపులు ఎదుర్కొన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముందుకు రావాలని కోరారు. దీంతో మరింత మరింత మంది బాధితులు బయటకు వచ్చారు కొద్ది రోజుల్లోనే కేసు పెద్దైంది. మొత్తం 9 FIRలు నమోదయ్యాయి. 8మంది మహిళలు, ఓ పురుషుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులన్నీ లైంగిక వేధింపులు, 
అత్యాచారం, బలవంతపు సంబంధాలు,  స్టాకింగ్, బెదిరింపులు,  మతపరమైన ఒత్తిళ్లు, మార్పిడి ప్రయత్నాలు , మతంపై దూషణలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. 
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకే మతానికి చెందిన వారు కావడంతో  ఇది 'కార్పోరేట్‌ జిహాద్‌'గా మారింది.

అరెస్టైన వారంతా ఒకేమతానికి చెందిన వారు

 9 FIRలలో ఏడుగురు అరెస్ట్‌ చేయగా.. అరెస్టైన వారంతా  BPOలో టీమ్ లీడర్లు, HR అధికారులు ఉన్నారు వారంతా ఒకేమతానికి చెందిన వారు. అరెస్టెన వారిలో  అసిఫ్ అంసారీ, షఫీ షేక్, షారుక్ ఖురేషీ, రజా మెమన్, తౌసిఫ్ అట్టార్, డానిష్ షేక్  ఉన్నారు. వీరితో పాటు.. ఉద్యోగినులు ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోని మహిళా AGM HRను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  దీంతో విషయం మతపరంగా మారిపోయింది. బీజేపీ దీనిని పక్కా ప్రణాళికతో చేసిన కార్పోరేట్ స్కాండల్ అంటోంది.  నిందితుల తరపు లాయర్లు మాత్రం దీనిని అనవసరంగా సన్సేషనల్ చేస్తున్నారని.. విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని కామెంట్‌ చేస్తున్నారు. ఆఫీసుల్లో జరిగిన సంభాషణల్లో వచ్చిన అభిప్రాయ భేదాలు,  విభిన్న ఆలోచనలు, భావజాలల మధ్య అంతరాలే తప్ప.. బలవంతంగా ఏం జరగలేదని లాయర్లు చెబుతున్నారు. 

TCS స్పందన 

ఈ వ్యవహారాన్ని TCS చాలా సీరియస్‌గా తీసుకుంది. అరెస్టైన ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారాన్ని తాము చాలా తీవ్రంగా తీసుకుంటున్నామని TCS ప్రకటించింది. పని ప్రదేశంలో బలవంతాలను నిరోధించే Zero Tolerence కు తాము కట్టుబడి ఉన్నామని ఇలాంటి విషయాలను ఏమాత్రం ఉపేక్షించని చెప్పింది. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కూడా ఇది తీవ్రంగా విచారించదగ్గ విషయమని..దీనిపై సంస్థ COO ఆర్తి సుబ్రమణియన్‌తో విచారణ జరిపిస్తున్నామని ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Teacher Burns Child Private Part: వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
SC Status Religious Conversion Verdict: మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget