అన్వేషించండి

TCS Nashik Case: నాసిక్‌ టీసీఎస్‌ మతమార్పిడిల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు ! పరారీలో నిడా ఖాన్!

TCS Nashik Case: టీసీఎస్‌ నాసిక్‌ బ్రాంచ్‌లో మహిళపై వేధింపులు, బలవంతపు మతమార్పిడుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అప్‌డేట్స్‌పై ఇన్‌డెప్త్ రిపోర్ట్. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TCS నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
  • 8 మంది మహిళా ఉద్యోగులు 4 ఏళ్లుగా శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నారు.
  • నిందితులు కంపెనీలో సమాంతర వ్యవస్థ నడిపి, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.
  • కేసులో 8 మంది అరెస్టు, ఒక మహిళా నిందితురాలు పరారీలో ఉన్నారు.

TCS Nashik Case: భారత్‌లో అతి పెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ నాసిక్ యూనిట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటనలు కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో లైంగిక వేధింపులతోపాటు వ్యవస్థీకృత మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సాగిస్తోందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిక్ పోలీసులు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిడా ఖాన్ గురించి వస్తున్న సమాచారం మరింత చర్చనీయాంశమవుతోంది. 

నాలుగేళ్ల నుంచి నరకం

నాసిక్‌లోని టీసీఎస్‌ బీపీవో యూనిట్‌లో పని చేసే 8 మంది మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులను ఆశ్రయించడంతో భారీ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య కాలంలో తమను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, మతం మారాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. వారంతా కంపెనీ ఉద్యోగులుగా మారువేషాల్లో వెళ్లి బ్రేక్‌త్రూ సాధించారు. దీంతో సిట్ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఇందులో ఒక మేల్ ఎంప్లాయ్‌ తనను మతపరంగా వేధించారని, మతం మారాలని ఒత్తిడి చేశారని చెప్పారు. 

సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు

కంపెనీ కార్యాలయంలోనే నిందితులు ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నట్టు మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేసేవారిని ఆమె తెలిపారు. భద్రతా కారణాల పేరుతో ఉద్యోగుల ఫోన్‌లు, బ్యాగులు, లంచ్‌ బాక్స్‌లను కూడా ఆఫీస్‌ ఫ్లోర్‌ వెలుపలే ఉంచాలని నిబంధనలు విధించేవారని, దీని వల్ల లోపల జరిగే అక్రమాలు ఎక్కడా రికార్డు కాకుండా చూసుకునే వారని ఆమె ఆరోపించారు. టీమ్‌ లీడర్లు తమ డెస్క్‌ల వద్ద మహిళలను పిలిచి అసభ్యకరమైన భాషలో మాట్లాడేవారని వృత్తిపరమైన వాతావరణానికి విరుద్ధంగా ప్రవర్తించేవారని బాధితులు వాపోయారు. 

లైంగిక వేధింపులు- హోటల్స్ బుకింగ్స్

ఈ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో డానిష్, రజా అనే వ్యక్తులు ఆఫీసు నుంచే వారాంతాల్లో హోటళ్లు, రిసార్టులు బుక్ చేసే వారని బాధితులు తెలిపారు. యువ మహిళా ఉద్యోగులు తమతో పాటు ఆ హోటళ్లకు రావాలి ఒత్తిడి చేసేవారని ఆరోపించారు. సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగిందని మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో ఒక లైంగిక వేధింపుల నెట్‌వర్క్ పని చేస్తోందని బాధితులు చెబుతున్నారు. 

మత మార్పిడి ఆరోపణలు, వేధింపులు 

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తౌసిఫ్ అత్తార్ మహిళా ఉద్యోగుల హిందూ మత ఆచారాలను లక్ష్యంగా చేసుకునే వాడని ఆరోపణలు వచ్చాయి. పండుగల సమయంలో మహిళలు చీరలు కట్టుకుని లేదా బొట్టుపెట్టుకొని ఆఫీస్‌కు వచ్చినప్పుడు అతను వారిని హేళన చేసేవాడని సాక్షులు చెబుతున్నారు. "నువ్వు ఎందుకు ఈ మతాన్ని ఫాలో అవుతున్నావ్‌? అంటూ తౌసిఫ్‌ నిలదీసేవాడని, కృష్ణ అనే ఒక ఉద్యోగి రుద్రాక్ష మాలను ధరించే వారని,అయితే నిందితుల ఒత్తిడి వల్ల అతను ఇస్లాం మతంలోకి మారినట్టు ఒక మాజీ ఉద్యోగి వెల్లడించారు. హిందూ దేవతలను దూషించడం, బలవంతంగా మాంసాహారం తినిపించం, నిర్దిష్ట మతపరమైన పద్ధతులను పాటించాలని ఒత్తిడిచేయడం వంటి చర్యలను నిందితులు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్నారు. 

నిడా ఖాన్ ఎవరు? ఎక్కడ ఉంది?

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నిందితురాలు నిడా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉంది. తొలుత ఆమె టీసీఎస్ హెచ్ ఆర్‌ మేనేజర్‌ అని వార్తలు వచ్చినప్పటికీ, తాజా ఆధారాల ప్రకారం ఆమె కేవలం ఒక టెలికాలర్ మాత్రమేనని తెలుస్తోంది. టీసీఎస్‌ నాసిక బీపీఓ యూనిట్‌లో ఆమె ప్రాసెస్‌ అసోసియేట్‌గా పని చసే వారిని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒక మహిళా ఉద్యోగి తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, నిడా ఖాన్ ఆమెను అడ్డుకుని ఇలాంటి జరుగుతూనే ఉంటాయని చెప్పి కేసును తప్పుదారి పట్టించారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ప్రస్తుతం పోలీసుల నుంచి తప్పించుకోని తిరుగుతోందని గర్భవతిని అని చెబుతూ కోర్టు నుంచి ఊరట పొందడానికి ప్రయత్నిస్తోందని సమాచారం. 

ఈ కేసులో పోలీసుల ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. వారిలో డానిష్‌ షేక్‌, తౌసిఫ్‌ అత్తార్‌, రజా మెమన్, షారుఖ్‌ ఖురేషీ, షఫీ షేక్‌, ఆసిఫ్‌ అఫాబ్‌ అన్సారీ, షారుఖ్‌ షేక్ ఉన్నారు. అరెస్టు అయిన వారందరినీ టీసీఎస్‌ యాజమాన్యం తక్షణమే సస్పెండ్ చేసింది. మరో మహిళా ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలపై సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. మోసపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అడ్వకేట్‌ అశ్విని కుమార్ కోర్టును కోరారు. 

Frequently Asked Questions

TCS నాసిక్ కేసులో ప్రధాన ఆరోపణలు ఏమిటి?

TCS నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, వ్యవస్థీకృత మతమార్పిడి ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా, మతం మారాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో ఎంత మందిని అరెస్టు చేశారు?

ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారందరినీ TCS యాజమాన్యం తక్షణమే సస్పెండ్ చేసింది. మరో మహిళా ఉద్యోగి పరారీలో ఉన్నట్టు సమాచారం.

నిడా ఖాన్ పాత్ర ఏమిటి?

నిడా ఖాన్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నిందితురాలు. ఆమె కేవలం ఒక టెలికాలర్ అని, ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, కేసును తప్పుదారి పట్టించిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది.

మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి?

నిందితులు హిందూ మత ఆచారాలను లక్ష్యంగా చేసుకుని, మహిళలను హేళన చేశారని ఆరోపణలున్నాయి. రుద్రాక్ష మాల ధరించే ఉద్యోగిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, హిందూ దేవతలను దూషించడం, మాంసాహారం తినిపించడం వంటి చర్యలకు పాల్పడ్డారని FIRలలో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget