News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jaipur Restaurant: మగవారికి గట్టి షాకిచ్చిన జైపూర్ రెస్టారెంట్... ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం

ఇంట్లో కూర నచ్చకపోయినా, స్నేహితులతో మస్తీ చేయాలనుకున్నా మగవాళ్లంతా రెస్టారెంట్లకు చేరుకుంటారు.

FOLLOW US: 
Share:

ఇంట్లో ఆడవాళ్లను వదిలేసి రెస్టారెంట్లకు చెక్కేసే మగమహరాజులకు జైపూర్ లోని ఓ రెస్టారెంట్ గట్టి షాకే ఇచ్చింది. తమ రెస్టారెంట్లకు కచ్చితంగా మహిళలతో కలిసే రావాలని  షరతు పెట్టింది. పురుషుల మాత్రమే వస్తే అనుమతించబోమని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ రెస్టరెంట్ వివరాలు ట్విట్టర్ లో ట్రెండవుతున్నాయి. ఈ హోటల్ పేరు ‘గోపి పవిత్ర భోజనాలయ’. జైపూర్ నడిబొడ్డులో ఉన్న ఈ రెస్టారెంట్ కు మంచి పేరే ఉంది. ఆహారం, రుచిగా, శుచిగా ఉంటుందని చెప్పుకుంటారు జైపూర్ జనాలు. అయితే ఈ  హోటల్ వారు హఠాత్తుగా ఓ బ్యానర్ ను తమ హోటల్ వెలుపల, లోపల కట్టారు. అందులో ‘మహిళలతో కలిసి వస్తేనే లోపలికి అనుమతించబడును’ అని రాశారు. ఈ బ్యానర్ ను ఓ ట్విట్టర్ యూజర్ ఫోటో తీసి పోస్టు చేయడంలో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఈ ట్వీట్ ను దాదాపు వేయిమంది దాకా రీ ట్వీట్ చేశారు. వేల మంది లైకులు కొట్టారు. ‘తాగుబోతులు, రౌడీలను దూరంగా పెట్టడానికి ఇది మంచి ఆలోచన’ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొక బ్రహ్మచారి ‘అన్ని రెస్టారెంట్లు ఇదే పద్దతి పాటిస్తే నాలాంటి వాళ్లు ఆకలితో మాడి చస్తారు’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘డేటింగ్ లో భాగంగా అమ్మాయిని తీసుకొని ఈ రెస్టారెంట్ కు వెళ్లొచ్చా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రెస్టారెంట్ వాళ్లకే నష్టమని భావించే వాళ్లూ ఉన్నారు. ఎక్కువగా బయట తినేది మగవాళ్లేనని, ఆడవాళ్లు ఇంటి ఆహారానికే ప్రాధాన్యనిస్తారని అంటున్నారు. కానీ రెస్టారెంట్ వాళ్లు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.

To all those who want to know about the place.
It's Gopi Bhojnalaya in Jaipur. Food is amazing. Must try. pic.twitter.com/TOl8gwk0My

— Harshita Sharma (@Harshita511) October 17, 2021

">

Also read: గంటలు గంటలు కూర్చుని నిద్రపోవడం.. ప్రాణానికే ప్రమాదమా?

Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు

Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి

Also read: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Oct 2021 09:11 AM (IST) Tags: women Men And Women Jaipur restaurant Jaipur hotel

ఇవి కూడా చూడండి

Healthy Tea for Weight Loss : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే

Healthy Tea for Weight Loss : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే

Google Lens : గూగుల్​ లెన్స్​తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?

Google Lens : గూగుల్​ లెన్స్​తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?

Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి

Mustard Oil: చలికాలంలో చర్మాన్ని రక్షించే ఆవనూనె, ఇలా ఉపయోగించండి

Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

Telugu Recipes: పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి

Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి

Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి