Hair Fall: ఇరవై, ముఫ్పైలలోనే బట్టతల? కారణాలు ఇవే కావచ్చు...
జుట్టు ఊడిపోతుందా? బట్టతల వచ్చేలా? ఎందుకిలా జరుగుతుందో ఆలోచించారా? కారణాలు ఇవి కూడా కావచ్చేమో..
జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. డెర్మటాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం రోజుకి యాభై నుంచి వంద వెంట్రుకలు రాలడం సహజం. కొందరిలో మాత్రం అంతకు మించి ఊడిపోతుంటాయి. జుట్టును కాపాడుకోవడానికి అమ్మమ్మలు చెప్పిన చిట్కాలతో పాటూ, ఆన్ లైన్ లో దొరికే అనేక ఉత్పత్తులను వాడుతారు. అయినా సరే ఫలితం ఉండదు. నలభై ఏళ్లు దాటిన వారిలో ఇలా జుట్టు ఊడినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంకా ఇరవైలలో, ముప్పైలలో ఉన్న అబ్బాయిలకు బట్టతల సమస్య ఎక్కువవుతుంది. చాలా మంది ఆ బట్టతల వల్ల ఆత్మన్యూనతకు గురవుతున్నారు. బట్టతల రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందువల్లో వస్తుందో తెలుసుకుంటే ముందే జాగ్రత్త పడొచ్చు. ప్రముఖ డెర్మటాలజిస్టు డాక్టర్ కిరణ ఇన్ స్టాలో పంచుకున్న వివరాలు ఇవిగో...
కొన్ని ముఖ్య కారణాలు
1. మీ ఆహారంలో చక్కెర శాతం అధికంగా ఉండడం. అంటే స్వీట్లు, చాకోలెట్లు, కూల్ డ్రింకులు, ఇలా చక్కెర శాతం అధికంగా పదార్థాలు అధికంగా తినడం వల్ల కూడా జుట్టు రాలచ్చు.
2. హై గ్లైసీమిక్ ఆహారాలు అంటే బ్రెడ్, కేక్స్, కుకీస్, నూనెలో వేయించిన వేపుళ్లు, చిప్స్, పైనాపిల్, ఖర్జూరం, కిస్ మిస్ వంటివి. వీటిని పరిమితంగా తీసుకుంటే చాలా ఆరోగ్యం. కానీ కొందరు వాటినే భోజనంలా ఎక్కువ మొత్తంలో తింటుంటారు.
3. శరీరానికి అన్ని విటమిన్లు కావాల్సినంత మోతాదులో అందకపోయినా జుట్టు రాలుతుంది. ఇలా విటమిన్ లోపం లేకుండా చూసుకోండి.
4. థైరాయిడ్ సమస్యలున్నవారికి కూడా వెంట్రుకలు అధికంగా రాలిపోతాయి.
5. ప్రోటీన్ పొడులను తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇది కూడా జుట్టు రాలడానికి కారణంగా చెబుతున్నారు డెర్మటాలజిస్టు.
6. కొంతమందికి వారసత్వంగా కూడా బట్టతల వచ్చే ఛాన్సు ఉంది.
[insta]
View this post on Instagram
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
Also read: ఈ అయిదు తినండి చాలు... చర్మం మెరిసిపోవడం ఖాయం
Also read: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి