Foods for Beauty: ఈ అయిదు తినండి చాలు... చర్మం మెరిసిపోవడం ఖాయం
మన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేది పోషకాహారమే. అందంగా కనిపించాలనుకుంటే చర్మాన్ని మెరిపించే ఆహారాన్ని తినాల్సిందే.
మనం తినే ఆహారం చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నూనెపదార్థాలు, అనారోగ్యకరమైన ఆహారం శరీరానికే కాదు, చర్మానికి కూడా మంచిది కాదు. తాజా చర్మమే మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి చర్మం మెరుపు అవసరమైన ఆహారాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అయిదు రకాల ఆహారాన్ని వారంలో కనీసం రెండు సార్లు తీసుకున్నా చాలు మీ ముఖం కళతో మెరిసిపోతుంది.
1. నారింజలు
ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తిన్నా, చర్మానికి పూసుకున్నా మంచిదే. తింటే చర్మం లోపల నుంచి మెరుపు తన్నుకొస్తుంది. అదే నారింజ రసాన్ని లేదా నారింజతొక్కల పొడిని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న మలినాలు పోయి, మంచి మెరుపు వస్తుంది.
2. స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీల్లో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ నిండి ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం బిగుతును కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి తినడం, దాని గుజ్జును ముఖానికి పూసుకోవడం వంటి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు ఏజింగ్ లక్షణాలను కూడా అడ్డుకుంటాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా కాపాడతాయి.
3. గుమ్మడి కాయలు
గుమ్మడి కాయను ఇంటికి దిష్టిగా కట్టుకునే వాళ్లే ఉన్నారిప్పుడు. ఆహారంగా తీసుకుంటున్నవాళ్లు చాలా తక్కువ. అందులో ఉండే ఆరోగ్యకరైన పోషకాల గురించి తెలుసుకుంటే రోజూ గుమ్మడి కాయతో వంటలు చేసుకుంటారు తెలుసా. ఇందులో యాంటీ ఆక్సడింట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి ఉన్నాయి. ఇందులో ఉండే జింక్ కొత్త చర్మ కణాల సృష్టికి సాయపడుతుంది. అలాగే గుమ్మడితో చేసిన వంటలు తినేవాళ్లలో చర్మంపై జిడ్డు పట్టడం కూడా తగ్గుతుంది. స్కిన్ టోన్ మెరుగుపరచడంలోనూ ఇది సహాయపడుతుంది.
4. బీట్ రూట్
బీట్ రూట్ రంగే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పింక్ రంగులో ఉన్న బీట్ రూట్ జ్యూసును తాగితే చర్మానికి, శరీరానికి పోషకాలు అందుతాయి. చర్మం మెరుపు సంతరించుకుటుంది. బీటూరూట్ రక్తాన్ని శుద్ది చేయడంలో సహాయపడుతుంది. హానికర టాక్సిన్లను శుభ్రపరుస్తుంది.
5. టమోటో
టమోటోలలో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ ఏ, కె, బి1, బి3, బి5, బి6, బి7, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. టమోటోలు అద్భుతైన యాంటీ ఏజింగ్ లక్షనాలను కలిగి ఉంటాయి. టమోటోలు రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే టమోటో గుజ్జును ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. దీని వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు
Also read: ఇన్ స్టాలో ఫుడ్ ఫోటోలు షేర్ చేసే వారికి ఓ హెచ్చరిక... బరువు పెరుగుతారు జాగ్రత్త
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి