Corona virus: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
పిల్లలపై కరోనా వైరస్ చూపించే ఎఫెక్ట్ తక్కువే. కానీ పిల్లలు ఆ వైరస్ ను వ్యాప్తి చేయలేరని మాత్రం చెప్పలేం.
ప్రపంచదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్లు జోరు మీద సాగుతున్నాయి. కానీ 18 ఏళ్ల వయసులోపు వారికి ఇంకా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. పెద్దవారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతోంది. అయితే ఓ పరిశోధన ప్రకారం... కరోనా వ్యాప్తి విషయంలో పెద్దలతో పోలిస్తే పిల్లలు కూడా తక్కువేం కాదని, వారు కూడా కరోనా వైరస్ ను వ్యాప్తి చెందించగల శక్తి సామర్థ్యాలు కలవారేనని తేల్చింది. వైరస్ ను తీసుకెళ్లి ఇతర వ్యక్తులకు సోకేలా వీరు చేయగలరని చెప్పారు అధ్యయనకర్తలు. ఈ అధ్యయనాన్ని హార్వర్డ్ బృందంతో పాటూ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్స్, రాగాన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు.
ఈ పరిశోధన కోసం రెండు వారాల నుంచి 21 సంవత్సరాల మధ్య గల 110 మందిని ఎంపిక చేసుకున్నారు. వారంతా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారే. కాగా వారి వయసుకు, వారిలో చేరిన వైరస్ లోడ్ కు మధ్య ఎటువంటి సంబంధం కనిపించలేదు. అంతేకాదు వారిలో ఎటువంటి వ్యాధితీవ్రత కూడా కనిపించలేదు. అయితే కోవిడ్ విషయం తెలిసి వారిలో కలిగిన భయం, వారి కుటుంబసభ్యుల్లో కలిగే ఆందోళన మాత్రం అధికంగానే ఉంది. అయితే పిల్లలు తమ శరీరంలో చేరిన వైరస్ ను మోసుకెళ్లి ఇతర వ్యక్తులకు సోకేలా చేయగలరు అని కచ్చితంగా చెబుతున్నారు పీడియాట్రిక్ పల్మనాలజిస్టు లేల్ యోంకర్.
పిల్లలకు కరోనా సోకినప్పటికీ పెద్దగా లక్షణాలు బయటపడవు. అయినప్పటికీ వారు ప్రమాదకరమైన కొత్త వేరియంట్లను కలిగి ఉండవచ్చు. అవి వారిపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చు కానీ, వారి నుంచి ఇంట్లోని పెద్దవారికి సోకే అవకాశం ఎక్కువే. త్వరలో కోవాక్సిన్ వ్యాక్సిన్ మనదేశంలో పిల్లలకు వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే అనేక దేశాలలో పిల్లలు తమ కోవిడ్ టీకాలను తీసుకోవడం ప్రారంభించారు. వీరికి కూడా వ్యాక్సినేషన్ పూర్తయితే ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న జనాభాకు వైరస్ వ్యాప్తి కాకుండా పూర్తిగా అరికట్టవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఆ సమస్యతో బాధపడుతున్న మహిళలకు గర్భనిరోధక మాత్రలతో మేలు
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి