By: ABP Desam | Updated at : 17 Oct 2021 08:18 AM (IST)
(Image credit: Pexels)
అధిక బరువు... ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన సమస్య ఇదే. తింటే బరువు పెరుగుతామేమోనని... చాలా మంది తక్కువ తింటూ, ఖాళీ కడుపుతోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది. కెలోరీలు ఎక్కువ తినడం ప్రమాదమే కావచ్చు, అస్సలు తినకపోయినా అనారోగ్యమే. అందుకే మీరు కెలోరీల గురించి ఆలోచించకుండా రోజులో ఎప్పుడైనా తినే ఆహారాన్ని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.
1. ఓట్స్
ఓట్స్ ను చాలా తక్కువగా ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఇది మంచి శక్తి వనరు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు ఇది పవర్ ప్యాక్ ఆహారం. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అలాగే ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ బి కూడా ఓట్స్ లభిస్తాయి. దీన్ని ఏ సమయంలో తిన్నా కూడా మంచిదే. రోజులు రెండుమూడుసార్లు తినాల్సి వచ్చినా కెలోరీల గురించి ఆలోచించకుండా తినేయండి.
2. గుడ్డు
గుడ్డు పేరు చెబితే చాలు అమ్మో బరువు పెరిగిపోతాం అంటూ చాలా మంది దూరం జరిగిపోతారు. ఒక గుడ్డులో లభించే కెలోరీలు కేవలం 71. ఈ మాత్రం కెలోరీలకు మీరు బరువు పెరిగిపోరు. కాబట్టి రోజులో ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఓ గుడ్డు ఉడకబెట్టుకునో లేక, ఆమ్లెట్ వేసుకునో తినేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
3. అరటిపండ్లు
ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను చాలా సులభతరం చేస్తాయి. కాబట్టి కెలోరీలు చేరిపోతాయనన భయం లేకుండా రోజులో ఓసారి అరటిపండు తినండి.
4. టోస్ట్
రొట్టెతో చేసే టోస్ట్ పిల్లలకు నచ్చుతుంది. దీన్ని పెద్దలు కూడా ఇష్టంగానే తింటారు. ఇది పేగుల్లో కార్బోహైడ్రేట్లను త్వరగా విచ్చిన్నం అయ్యేలా చేస్తుంది. గుండెల్లో మంటను, వికారం లక్షణాలను తగ్గించడంలో ముందుంటుంది. అయితే రోజులో ఎప్పుడైనా ఒకటి లేదా రెండు బ్రెడ్డు ముక్కలు తినొచ్చు. అతిగా తింటే మాత్రం మంచిది కాదు.
5. చిలగడదుంపలు
చిలగడదుంపలు ఆరోగ్యానికి చాలా మంచివి. సులువుగా జీర్ణమవుతాయి కూడా. ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టిరియాలను పెంచడంలో సహాయపడుతుంది. తియ్యటి దుంపల్లో పొటాషఇయం, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. సాయంత్రం పూట వీటిని తింటే చాలా మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: అమ్మ అవ్వాలనుకుంటే... మీరు, మీ శరీరం సిద్ధమవ్వండిలా
Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!
Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
Best Colours: ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి లక్కీ కలర్స్ ఇవేనట, ఈ రంగు డ్రెస్సులు రెడీ చేసుకోండి మరి
Nuvvula Chutney: ఆరోగ్యానికి మేలు చేసేలా నువ్వుల పచ్చడి, సింపుల్గా ఇలా చేసేయండి
Love Signs: ఈ లక్షణాలు కనిపిస్తే అతడు లేదా ఆమె ప్రేమ నిజమైనదనే అర్థం
High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!