By: ABP Desam | Updated at : 17 Oct 2021 12:47 PM (IST)
(Image credit: Pixabay)
గర్భనిరోధక మాత్రలు అతిగా వాడడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అయితే కొన్ని ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్న మహిళలకు మాత్రం ఈ మాత్రలు కాస్త మేలు చేస్తాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్యతో బాధపడుతున్న మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడితే, వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పాతిక శాతం దాకా తగ్గుతుందని చెబుతోంది కొత్త అధ్యయనం.
జర్నల్ డయాబెటిస్ కేర్ మ్యాగజైన్ లో ప్రచురించిన కథనం ప్రకారం పీసీఓఎస్ ఉన్న మహిళలకు డయాబెటిస్ వచ్చే అవకాశం రెండు రెట్లు అధికం. ప్రపంచంలో పది శాతం మంది మహిళల్లో పీసీఓఎస్, డయాబెటిస్ రెండూ బయటపడ్డాయి. అలాగే ఎండో మెట్రియల్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలు కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటి ఆఫ్ బర్మింగ్ హామ్ వారు నిర్వహించారు. పీసీఓఎస్ వ్యాధితో బాధపడే స్త్రీలలో పీరియడ్స్ సరిగా రావు. కొందరికీ పూర్తిగా రాకుండా ఆగిపోతాయి. పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. చాలా మందిలో ముఖం మీద అవాంఛిత జుట్టు పెరుగుతుంది. మొటిమల సమస్య కూడా మొదలవుతుంది. ఆండ్రోజెన్ హార్మోన్ రక్తంలో అధికంగా కలవడం వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎస్ వల్ల మహిళలు అధికంగా బరువు పెరుగుతారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 64,051 మంది పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళల హెల్త్ రికార్డును పరిశీలించారు. అలాగే 1,23,545 మంది ఆరోగ్యకరమైన స్త్రీల హెల్త్ రికార్డును పరిశోధించారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే , ఆ వ్యాధి ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా కనిపించింది. పీసీఓఎస్ బారిన పడిన మహిళల్లో 4,814 మందికి గర్భనిరోధక మాత్రలను ఇచ్చి వారిపై ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించారు. ఆ మాత్రలు ఆండ్రోజెన్ హార్మోన్ల విడుదలను తగ్గించి, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గించినట్టు గుర్తించారు. ఈ ట్యాబ్లెట్లలో ఈస్ట్రోజెన్ లు ఉంటాయి. ఇవి రక్తంలో సెక్స్ హర్మోన్ అయిన బైండింగ్ గ్లోబిన్ అనే ప్రోటీన్ ను పెంచుతాయి. ఈ ప్రోటీన్ ఆండ్రోజెన్ ను బంధింస్తుంది. ఇంకా దీనిపై క్లినికల్ ట్రయల్స్ పెంచాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
Also read: ఇలాంటి ఆహారపదార్థాలు తింటున్నారా... అయితే మతిమరుపు వచ్చే ఛాన్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
సోయాతో చేసిన మీల్ మేకర్ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?
Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే
ఈ హెయిర్ మాస్క్లు ట్రై చెయ్యండి - ఇక జుట్టు అందానికి తిరుగుండదు
Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!
Overripe Banana: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్