Lung cancer: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి
ఊపిరితిత్తుల క్యాన్సర్ భయంకరమైన వ్యాధుల్లో ఒకటి. దేనినైనా మొదటి స్టేజ్ లోనే కనుగొంటే చికిత్స సులభతరం అవుతుంది.
![Lung cancer: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి Lung cancer: Watch out for this early symptom in the way you walk Lung cancer: మీ నడకే మీకు చెప్పేస్తుంది... ఈ మహమ్మారి గురించి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/fc9f986a47a62ca144a286cdc096cd92_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బయటికి కనిపించకుండా లోలోపలే శరీరాన్ని కుళ్లింప జేసే భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అందులో ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తులపై క్యాన్సర్ కణితిలు పుట్టి తీవ్రంగా అనారోగ్యం పాలు చేస్తాయి. అయితే వీటిని మొదటి స్టేజ్ లోనే కనుగొంటే చికిత్స అందించడం, కోలుకోవడం కూడా సులువుగా మారుతుంది. చివరి దశకు చేరుకునే వరకు దీన్ని కనిపెట్టలేకపోతే, ఆ క్యాన్సర్ మిగతా శరీర భాగాలకు పాకి ప్రాణాన్ని హరించేస్తుంది. కనుక దీని ఈ క్యాన్సర్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి దీన్ని అంచనా వేసి, సకాలంలో వైద్యులను సంప్రదించవచ్చు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ముదిరిన కొద్దీ ఛాతీ నొప్పి, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ జలువు చేయడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివి కలుగుతుంటాయి. అయితే కొత్త అధ్యయనం ప్రకారం మీ నడక కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ను గుర్తించేందుకు సాయం చేస్తుంది. నడిచేటప్పుడు సాధారణంగా అనిపించదు. తమను తాము బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. నడకలో తేడా మీకే తెలిసిపోతుంది. దీనికి కారణం నరాల వ్యవస్థపై ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రభావం చూపడమే. బ్యాలెన్స్ డ్ గా నడవలేకపోవడం, సరిగా నడవలేకపోవడం ఎక్కువ కాలం జరిగితే ఓసారి వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. కండరాల కదలికలను నియంత్రించేది నాడీ వ్యవస్థే. దాని సాధారణ విధులకు ఆటంకం కలిగినప్పుడు మనిషి స్థిరంగా నిలబడలేకపోవడం, నడవలేకపోవడం వంటివి జరుగుతాయి. మైకంతో తూగినట్టు అవుతారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాడీ వ్యవస్థపై దాడిచేసినా ఇలానే జరుగుతుంది.
నడక బ్యాలెన్స్ తప్పితే ఇదే కారణమా?
బ్యాలెన్స్ డ్ గా నడవలేకపోవడం, మైకం కమ్మినట్టు అవడం... ఇవన్నీ కూడా కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ కే ముడిపడి ఉన్నవని చెప్పలేం. తలకు గాయం తగలడం, మైగ్రేన్, కాళ్ల నరాలు దెబ్బతినడం వంటివి కారణం కావచ్చు. అయితే బ్యాలెన్స్ గా నడవలేకపోవడంతో పాటూ శ్వాసకోశ సమస్యలు కూడా ఉంటే మాత్రం కచ్చితంగా క్యాన్సర్ నిపుణులను సంప్రదించాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఎర్రెర్రని బీట్ రూట్... తింటే మగవారికి ఎంతో మేలు
Also read: పిల్లలు తక్కువేం కాదు, వైరస్‌ను వాళ్లూ వ్యాప్తి చేయగలరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)