Suicide Machine: ‘ఆత్మహత్య’కు అనుమతి.. నొప్పిలేకుండా చంపే యంత్రానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఆత్మహత్యలను ప్రోత్సహించవద్దని అంతా గళమెత్తుతుంటే.. ఆ దేశం మాత్రం ఆత్మహత్యలు చేసుకొనేందుకు ఏకంగా ఓ యంత్రాన్నే సిద్ధం చేసేసింది.
ప్రాణం తీయడమే కాదు.. ప్రాణం తీసుకోవడం కూడా నేరమే. ముఖ్యంగా.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన అస్సలు మంచిది కాదు. చావడానికి చూపించే ధైర్యాన్ని.. జీవించేందుకు చూపిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు విజయం వరిస్తుంది. కానీ, అనారోగ్యంతో కదల్లేని పరిస్థితుల్లో.. ప్రతి రోజూ నరకం అనుభవించేవారి పరిస్థితి ఏమిటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. చనిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితుల గురించి మీరు వినే ఉంటారు. ఈ నేపథ్యంలో Switzerland (స్విట్జర్లాండ్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నొప్పిలేని మరణం కోసం తయారు చేసిన ‘సూసైడ్ మెషిన్’ (Suicide Machine)కు అనుమతి ఇచ్చింది.
రెప్పపాటులో మరణం: Sarco (సార్కో) అనే ఈ యంత్రం.. రెప్పపాటు వ్యవధిలో నొప్పి తెలియకుండానే చంపేస్తుంది. ఆత్మహత్య చేసుకోడానికి అనుమతి పొందే వ్యక్తి.. శవ పేటిక తరహాలో ఉండే ఆ యంత్రంలోకి వెళ్లి పడుకుంటే చాలు. హైపోక్సియా, హైపోకాప్నియా(Hypoxia and Hypocapnia)ను ఈ యంత్రం ద్వారా ప్రేరేపిస్తారు. దీనివల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సప్లై నిలిచిపోతుంది. రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరగడం వల్ల మరణం సంభవిస్తుందని ‘సార్కో’ తయారీదారులు వెల్లడించారు.
వైద్యుడి అనుమతి తప్పనిసరి: ఈ మొత్తం ప్రక్రియకు కేవలం ఒక నిమిషం మాత్రం సమయం పడుతుంది. ఈ యంత్రంలో పడుకొనే వ్యక్తి నొప్పి లేకుండా ఎంతో శాంతంగా ప్రాణాలు వదిలేస్తాడు. అయితే, ఈ యంత్రం సాయంతో చనిపోవాలంటే తప్పకుండా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. తీవ్రమైన వ్యాధులతో పోరాడుతూ.. మరణం కోసం ఎదురుచూసే రోగులకు మాత్రమే ఇలాంటి యంత్రాలను వాడాలని స్విట్జర్లాండ్ చట్టాలు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలని భావించే బాధితులు ముందుగా వైద్యుడి నుంచి సర్టిఫికెట్ పొందాలి. స్విట్జర్లాండ్‌లో ‘ఆత్మహత్య’లు చేసుకొనేవారి కోసం ప్రత్యేకంగా ‘డిగ్నిటాస్’, ‘ఎగ్జిట్’ అనే యూథనాసియా సంస్థలు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు 1300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, వీరు ఇప్పటివరకు వివిధ ఇంజక్షన్ల అందించడం ద్వారా బాధితులను దీర్ఘకాలిక కోమాలోకి పంపి చంపేస్తున్నారు. కొత్తగా ‘సార్కో’ యంత్రం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వీరి పని మరింత సులభతరం కానుంది.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
డాక్టర్ డెత్ సృష్టి: ‘సార్కో’ యంత్రాన్ని.. డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే రూపొందించారు. దీంతో ఆయన్ని అంతా ‘డాక్టర్ డెత్’ అని పిలుస్తున్నారు. ‘సార్కో’ అనే పేరును ‘సార్కోఫాగస్’ నుంచి తీసుకున్నారు. సార్కోఫాగస్ అంటే శవ పేటిక అని అర్థం. ఈ బయోడిగ్రేడబుల్ క్యాప్సూల్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ‘సార్కో’ క్యాప్సుల్‌లోకి నత్రజని (Nitrogen)ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఆక్సిజన్ శాతం తగ్గి వ్యక్తి చనిపోతాడు. దీంతో కొందరు ఈ క్యాప్సుల్‌ను ‘గ్యాస్ చాంబర్’తో పోల్చుతున్నారు. ఈ యంత్రం.. ఆత్యహత్యలను ప్రేరేపించేలా ఉందని, దీనికి నకళ్లు తయారైతే బలవన్మరణాలు పెరుగుతాయని అంటున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది నుంచి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!