By: Haritha | Updated at : 28 Dec 2022 12:43 PM (IST)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్
మనదేశంలోని ప్రతి ప్రాంతం ఎన్నో ఆహారాలకు, చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఇక్కడ దొరికే ఆహారాలు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. వాటి మూలాలు మాత్రం ఒక ప్రాంతానికే చెందుతాయి. ఆ మూలప్రాంతాన్ని గుర్తించి ఇచ్చేదే జీఐ ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్). అంటే ఒక ఉత్పత్తి లేదా వస్తువుకు ఆ ప్రాంతమే మూలమని చెప్పి ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు ఇది. దీన్నే తెలుగులో భౌగోళిక గుర్తింపు అంటారు.
ఎవరు ఇస్తారు?
ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ప్రకారం ఈ ట్యాగ్ ను అందిస్తారు. ముందుగా ఈ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ట్యాగ్ అందుకున్నాక పదేళ్ల పాటూ ఆ ఉత్పత్తిపై అన్ని హక్కులు ట్యాగ్ అందుకున్న ప్రాంతంలోని ఉత్పత్తిదారులకే ఉంటుంది. పదేళ్ల తరువాత కాల వ్యవధిని పునరుద్ధరించుకోవచ్చు. 2022లో జీఐ ట్యాగ్ సాధించిన ఆహార పదార్థాల జాబితా ఇక్కడ ఉంది.
స్నాప్ మెలోన్
దీన్ని కొడంగల్లూర్ పొట్టువెల్లారి అని కూడా పిలుస్తారు. దీన్ని కేరళలలోని కొడంగల్లూర్, ఎర్నాకులం ప్రాంతాలలో పండిస్తారు. దీన్ని జ్యూస్ తీసుకుని తాగుతారు ఎక్కువ మంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల పుష్కలంగా ఉంటాయి.
బ్లాక్ రైస్
మణిపూర్లో పండించే బ్లాక్ రైస్‌ను చక్ హూ అని పిలుస్తారు. ఆ రాష్ట్రంలో శతాబ్ధాలుగా ఈ బియ్యం సాగులో ఉన్నాయి. ప్రత్యేకమైన వాసనతో ఉండే ఈ బియ్యం చాలా ప్రత్యేకమైనవి. అందుకే బ్లాక్ రైస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అందుకుంది. వీటిని అక్కడ విందులో ప్రత్యేకంగా వండిస్తారు.
అట్టప్పడి అట్టుకొంబు అవరా (బీన్స్)
వీటిని కేరళలోని పాలక్కాడ్‌లోని అట్టప్పాడి ప్రాంతంలో సాగు చేస్తారు. ఇవి మేక కమ్ములా ఒంపుగా ఉంటాయి. ఇతర బీన్స్‌తో పోలిస్తే వీటి రుచి విభిన్నంగా ఉంటుంది.
అట్టప్పడి తువర (ఎర్ర పప్పు)
కేరళలో పండుతాయి ఈ ఎర్రపప్పు. వీటిని అట్టప్పడి తువారా అంటారు. తెల్లని తొక్కతో ఎర్రటి గింజలు ఉంటాయి. ఈ విత్తనాలు పెద్దగా, గింజ కాస్త బరువుగా ఉంటుంది.వీటి నిండా మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఫైబర్, కాల్షియం సమృద్ధిగా ఉండే వీటిని కూరగాయలుగా, పప్పుగా కూడా ఉపయోగిస్తారు.
కాజీ నేము
అస్సాంకు చెందిన పండు కాజీ నేము. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కుంకుమ పువ్వు
కుంకుమ పువ్వు కావాలంటే అందరికీ గుర్తొచ్చేది కాశ్మీర్. అలాంటిది కాశ్మీర్‌కు జీఐ ట్యాగ్ రాకుండా ఉంటుందా? కాశ్మీరీ కుంకుమ పువ్వు సముద్ర మట్టానికి 1600 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. అదే దీని ప్రత్యేకత.
Also read: మనకు తెలియకుండానే మెదడులో చేరే అమీబా, బ్రెయిన్ తినేస్తుంది - ఇది ఎలా శరీరంలో చేరుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్