Cheating: ‘గర్ల్‌ఫ్రెండ్‌ను చీట్ చేశా.. అందుకే ఈ శిక్ష’.. అబ్బాయి మెడలో బోర్డు, ట్విస్ట్ అదిరింది!
ఓ యువకుడు మెడలో ఓ కార్డ్‌బోర్డును మెడలో వేసుకుని రైల్వే స్టేషన్ ముందు నిలుచున్నాడు. గురువారం గర్ల్‌ఫ్రెండ్‌ను చీట్ చేసినందుకే ఈ శిక్ష అని ఆ కార్డ్‌బోర్డులో రాసి ఉంది.
ఓ యువకుడు మెడలో కార్డ్‌బోర్డు తగిలించుకుని మెట్రో స్టేషన్ ముందు నిలబడ్డాడు. ఆ బోర్డుపై ‘‘గురువారం నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను చీట్ చేశాను. అందుకే ఈ పనిష్మెంట్’’ అని ఆ బోర్డు మీద ఉంది. అటుగా వెళ్తున్న వ్యక్తులు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ‘‘గురువారం ఏం చేశావ్.. నీ గర్ల్‌ఫ్రెండ్ ఇలాంటి శిక్ష విధించింది’’ అని అడగడం మొదలుపెట్టారు. కానీ, అతను సమాధానం ఇవ్వలేదు. అయితే, అతడు మాత్రమే కాదు.. ఇంకా కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాంటి కార్డ్‌బోర్డులనే మెడలో వేసుకుని ప్రజలు తిరిగే ప్రధాన కూడళ్లలో నిలుచున్నారు. ఆ బోర్డులో కూడా ‘‘గురువారం నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను చీట్ చేశాను. అందుకే ఈ పనిష్మెంట్’ అని రాసి ఉంది. అదేంటీ అందరికీ ఒకరే గర్ల్‌ఫ్రెండా? లేదా పైగా వారంతా గురువారమే తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎందుకు చీట్ చేశారు’’ అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. అసలు విషయం తెలిసిన తర్వాత.. ఓరి వీళ్ల వేషాలో అని ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు.
లండన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది మెడలో కార్డ్‌బోర్డులు వేలాడదీసుకుని నిలుచున్న యువకుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై పెద్ద చర్చే జరిగింది. అయితే, అది ‘Thursday’ అనే డేటింగ్ యాప్ కోసం చేసిన వినూతన ప్రచారమని తెలిసిన తర్వాత అంతా తిట్టిపోశారు. అరే.. యాప్ ప్రచారం కోసం మరీ ఇలా చేయాలా.. అంటే మీరు ఈ ప్రచారం ద్వారా గర్ల్‌ఫ్రెండ్స్‌ను చీట్ చేయాలని ప్రోత్సహిస్తున్నారా? అంటూ ప్రజలు పచ్చి బూతులు తిట్టడం ప్రారంభించారు.
Also Read: దేశీయులు మహా రసికులు.. ఒక్కొక్కరూ 14 మందితో.. మనోళ్లు వెనుకబడ్డారే!
తమపై వస్తున్న ట్రోల్స్‌పై ‘Thursday’ యాప్ సంస్థ స్పందించక తప్పలేదు. ‘‘మేం మోసం చేసినవారిని క్షమించం’’ అని రెండు ముక్కల్లో చెప్పేసింది. ఆ విషయాన్ని ఆ యువకులు ధరించిన కార్డ్‌బోర్డ్ ప్రకటనలో ‘శిక్ష’ విధిస్తున్నట్లు.. చెప్పకనే చెప్పామన్నట్లుగా సమాధానమిచ్చింది. పాపం ఈ ట్విస్ట్ తెలియక చాలామంది ఇంకా.. ఆ బోర్డులను మెడలో వేసుకుని తిరుగున్న యువకులు.. నిజంగానే తమ గర్‌ఫ్రెండ్స్‌ను చీట్ చేసినందుకు శిక్షగా అలా నిలుచున్నారేమో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రచారం భలే క్రియేటివ్‌గా ఉంది కదూ.
Absolute scenes at Liverpool Street this morning 😭 pic.twitter.com/mGVhjYn7fo
— H 777 (@hickzzz) October 12, 2021
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి