ప్రేమ ‘గాయం’.. యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...

‘‘నువ్వంటే నాకిష్టం.. ఎందుకిలా చేశావ్?’’ అంటూ ఆమె.. అతడి గుండెలపై వాలిపోయి.. కన్నీళ్లు పెట్టుకుంది. యాసిడ్ మంట కంటే.. మనసుకైన గాయమే ఎక్కువ నొప్పి పుడుతోందంటూ వాపోయింది. మరి.. ఆ రాక్షసుడి మనసు మారిందా?

FOLLOW US: 

తడు ఆమె ముఖంపై యాసిడ్ పోసి గాయపరిచాడు. రూపురేఖలు లేకుండా చేశాడు. అతడి ఉన్మాదం వల్ల ఒక కన్ను పోయింది. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే.. అతడిని శిక్షించాలని కోరుకుంటారేమో. కానీ, ఆమె మాత్రం అలా అనుకోలేదు. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడితోనే తన జీవితాన్ని పంచుకుంది. చేసిన తప్పును సరిదిద్దుకొనేందుకు ఆ వ్యక్తి కూడా ఆమెకు నో చెప్పలేదు. నువ్వు ఎలా ఉన్నా.. నా దానివేనంటూ.. తన గుండెలో చోటిచ్చాడు. యాసిడ్ పోసి జీవితాన్ని పాడుచేసిన ఆ వ్యక్తినే ఆమె ఎందుకు ప్రేమించింది? అతడిని ఎందుకు పెళ్లాడిందో తెలుసుకోవాలంటే.. ఆమెపై యాసిడ్ దాడికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. 

టర్కీలోని హటాయ్‌కు చెందిన బెర్ఫిన్ ఒజెక్ అనే 20 ఏళ్ల యువతి.. 23 ఏళ్ల కసీమ్ సెల్టిక్ అనే యువకుడిని రెండేళ్ల కిందట ప్రేమించింది. ఇద్దరు కలిసి కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఓ రోజు ఇద్దరి మధ్య చిన్న విషయం మీద పెద్ద గొడవే జరిగింది. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ, కసీమ్‌కు మాత్రం ఇది తట్టుకోలేకపోయాడు. తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదనే కోపంతో ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. 

ఈ దాడి వల్ల ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. ఒక కన్నుకు పూర్తిగా చూపు పోయింది. నొప్పితో విలవిల్లాడింది. ఆమె రూపురేఖలు మొత్తం మారిపోయాయి. తనకు ఈ పరిస్థితి కల్పించిన ప్రియుడిపై ఒజెక్‌కు కోపం రాలేదు. అతడిని క్షమించడమే కాకుండా.. మళ్లీ ప్రేమలో పడింది. అప్పటికే చేసిన తప్పుకు కుమిలిపోతున్న కసీమ్‌ను ఆమె ప్రేమ మళ్లీ మనిషిని చేసింది. అయితే, ఈసారి కసీం డేటింగ్ అంటూ ఆలస్యం చేయలేదు. ఆమె తన మనసులో మాట చెప్పగానే.. పెళ్లికి ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె తన అంగీకారం తెలిపింది. కానీ, ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. 

అరెస్టు చేయించిన ఆమే.. మళ్లీ ఎందుకు క్షమించింది?: యాసిడ్ దాడి జరిగిన రోజు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కసీమ్‌ను అరెస్టు చేశారు. రాక్షసుడిలా ఊగిపోతున్న అతడికి.. పోలీసులు గట్టిగానే బుద్ధి చెప్పారు. యాసిడ్ దాడిలో గాయపడిన ఒజెక్ నరకయాతన అనుభవించింది. తనని తాను అద్దంలో చూసుకోడానికే భయపడింది. బరువెక్కిన గుండె.. ఆమెను వెక్కి వెక్కి ఏడ్చేలా చేసింది. తన తప్పు తెలుసుకున్న కసీమ్.. ఆమె ఫోన్‌కు మెసేజులు పంపడం మొదలుపెట్టాడు. తనని క్షమించాలని కోరాడు. దీంతో ఆమె.. ఆ కేసును వెనక్కి తీసుకుంది.‘నువ్వంటే నాకిష్టం.. ఎందుకిలా చేశావ్?’’ అంటూ అతడి గుండెలపై వాలిపోయింది. యాసిడ్ మంట కంటే.. మనసుకైన గాయమే ఎక్కువ నొప్పి పుడుతోందంటూ కన్నీరుమున్నీరైంది. దీంతో.. కసీమ్ కూడా తప్పును తలచుకుని కుమిలిపోయాడు. ‘‘పెళ్లి చేసుకుందాం’’ అన్నాడు. అంతే.. అప్పటివరకు బాధతో తడిచిన ఆమె కళ్లు.. ఈసారి ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. వెంటనే అతడికి ఒకే చెప్పింది.

తన ప్రేమ కథను ఆమె సోషల్ మీడియాతో షేర్ చేసుకుంటూ ఇలా చెప్పింది. ‘‘మేమిద్దరం ఎన్నో లేఖలు రాసుకున్నాం. నేను అతడికి అన్నివిధాలా సొంతమయ్యాను. అతడి నేను ఎంతో ప్రేమించాను. అతడు కూడా నన్ను ఎంతో ప్రేమించాడు’’ అంటూ వారి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ఒజెక్ కేసును వెనక్కి తీసుకోవడం వల్ల అతడు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. దీంతో ప్రజలు ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ‘‘అతడికి నిజంగా ప్రేమ ఉంటే.. ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ, నువ్వు జీవితాంతం కుమిలిపోయే శిక్ష విధించాడు. అలాంటిది అతడితో నువ్వు జీవితాన్ని ఎలా పంచుకుంటావు? రేపు మరో కారణంతో నీకు హాని తలపెడితే?’’ అంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో ఆమె అతడిని క్షమించి తప్పు చేశానని భావించింది. ఈ కేసు గురించి తన లాయర్‌ సలహా తీసుకుని.. చట్టం ముందు ఒక్కరే అంటూ అతడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ కేసును మళ్లీ తెరిచింది. కానీ..

ఈ కేసును విచారించిన టర్కీ కోర్టు.. కసీమ్‌కు 13 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. అయితే, ఈసారి కసీమ్.. ఆమె చేసిన పనికి ఆగ్రహించలేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని మనసుకు సర్దిచెప్పుకున్నాడు. ఆమె డేరింగ్ నిర్ణయానికి ప్రజలు సైతం ఫిదా అయ్యారు. అప్పటి వరకు ‘‘తప్పుచేస్తున్నావ్..’’ అంటూ వేలెత్తి చూపించిన జనమే.. చేతులెత్తి ఆమెకు సలాం కొట్టారు. ఎందుకంటే.. ఆమె కేసు పెట్టే సమయానికి కసీమ్ ఒక ఉన్మాది. ఆ కేసును మళ్లీ తెరిచే సమయానికి అతడు.. ఆమెకు కాబోయే భర్త. జైల్లో ఉన్న కసీమ్‌ను చూసేందుకు ఒజెక్ ప్రతి రోజూ వెళ్లేది. అలా రెండేళ్ల గడిచిన తర్వాత ప్రొబేషన్ మీద కసీమ్ రిలీజ్ అయ్యాడు. ఈ ఏడాడి డిసెంబర్ నెలలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

ఒజెక్ తండ్రి స్పందన ఇది..: ఒజెక్ తనపై యాసిడ్ దాడి చేసిన మాజీ ప్రియుడిని పెళ్లాడటం ఆమె తండ్రి యాసర్ ఒజెక్‌కు అస్సలు ఇష్టం లేదు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మాకు చెప్పకుండానే ఆమె అతడిని పెళ్లి చేసుకుంది. ఆమెకు న్యాయం జరగాలని ఇన్నాళ్లూ పోరాడుతున్నా. కానీ, అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది’’ అని వాపోయారు. అయితే, ఈ పెళ్లి తర్వాత కసీమ్‌కు శిక్ష తప్పుందా అనే ప్రశ్నకు ఆమె లాయర్ స్పందిస్తూ.. ‘‘టెక్నికల్‌గా అతడు లీవ్‌లో ఉన్నట్లు. అతడు మళ్లీ జైలుకు వెళ్లి మిగిలిన శిక్ష అనుభవించాల్సిందే’’ అని తెలిపారు. అయితే, కరోనా వైరస్ వల్ల కొంతమంది ఖైదీలను వచ్చే ఏడాది మే, 2022 వరకు లీవ్ మీద బయటకు వదిలినట్లు జైలు అధికారులు చెప్పారు. అంటే.. కసీమ్-ఒజెక్‌లు అప్పటివరకు కలిసే ఉండవచ్చు. మరి.. వీరి ప్రేమ-పెళ్లిపై మీరు ఏమంటారు? శారీరకంగా.. మానసికంగా బాధించిన ఆ వ్యక్తినే ఆమె మళ్లీ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తగిన నిర్ణయమేనా?

Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. 

Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్

Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!

Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)

Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 09:45 PM (IST) Tags: Woman Marries Acid Attacker Acid Attack Acid Attack on Woman Woman Marries Ex Boyfriend Trukish Woman టర్కీ మహిళ Turkish Woman

సంబంధిత కథనాలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు