సర్వే: వామ్మో.. ఇంత రసికులా? ఆ దేశంలో ఒక్కొక్కరికీ 14 మందితో లైంగిక సంబంధం.. మనోళ్లు వెనుకబడ్డారే!
పురుషులు తమ జీవితంలో ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉంటారనే అంశంపై 35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు తెలిశాయి. ఇందులో మన దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా?
మనిషికి నీరు, ఆహారం ఎంత ముఖ్యమో.. శృంగారం కూడా అంతే అవసరం. ఆహారమైతే రకరకాల రుచులను ఆస్వాదించగలం. మరి, శృంగార విషయంలో అది సాధ్యమేనా? అనే ప్రశ్నకు ఒకొక్కరూ ఒక్కో సమాధానమిస్తారు. శృంగారమనేది తన జీవిత భాగస్వామితో మాత్రమే ఉండాలని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం నచ్చినవారితో శృంగారంలో పాల్గోవడం తప్పులేదని సమాధానమిస్తున్నారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ, భారతీయుల విషయానికి వస్తే.. ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం చాలా తప్పు. పెళ్లి తర్వాత ఆ వ్యక్తి తన భాగస్వామితో మాత్రమే పడక సుఖాన్ని అనుభవించాలి. వేరే మహిళలతో కలిస్తే దాన్ని అక్రమ సంబంధంగా పరిగణిస్తారు. అందుకే కాబోలు.. ఒకరు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగిన పురుషుల్లో మన దేశీయులు చిట్టచివరి స్థానంలో ఉన్నారు.
టర్కీలో పురుషులు మహా రసికులు: పురుషుల మానసిక ఆరోగ్యాన్ని విశ్లేషించే ‘మాన్యువల్’ అనే సంస్థ ఇటీవల ప్రపంచంలోని 35 దేశాల్లోని పురుషులు తమ జీవితంలో ఎంతమందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రపంచంలో టర్కీ పురుషులే అత్యధిక మహిళలతో శృంగారంలో పాల్గొంటున్నట్లు తేలింది. ఒక్కొక్కరు సరాసరి 14.5 మందితో పడక గది సుఖాన్ని ఆస్వాదిస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు.
టర్కీ తర్వాత 13.3 మందితో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 13.2, ఐస్‌లాండ్ 13.2, దక్షిణాఫ్రికా 12.5 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శృంగారాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారని భావించే అమెరికా, యూకే, రష్యా దేశీయులు.. టర్కీతో పోల్చితే కాస్త వెనుకబడ్డారు. అమెరికాలో 10.7, యూకేలో 9.8, రష్యాలో 9.. చొప్పున సెక్సువల్ పార్టనర్స్ కలిగి ఉన్నారట. రొమాన్స్‌కు మారుపేరైన ఫ్రాన్స్‌లో సైతం పురుషులు సగటున 8.1 లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారట.
ఇండియా, చైనాలో తక్కువే..: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఇండియా, చైనాలు మాత్రం సెక్సువల్ పార్టనర్ల విషయంలో వెనుకబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా ఇతరులతో శృంగార సంబంధాన్ని కలిగి ఉన్నా.. ముగ్గురు లేదా అంతకంటే తక్కువ మందితోనే ఆ సుఖాన్ని పొందుతున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. భారతీయులు సరాసరిగా ముగ్గురు, చైనీయులు 3.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. 35 దేశాల్లో ఇండియా చివరి స్థానంలో, చైనా 34వ స్థానంలో నిలిచింది.
Also Read: అద్భుతం.. వేళ్లతో కాదు ‘మెదడు’తో ట్వీట్లు చేస్తున్న పెద్దాయన.. ఇదిగో ఇలా..
చిన్న వయస్సులోనే ‘తొలి’ అనుభవం: ఐస్లాండ్ వంటి దేశాల్లో పిల్లలు టీనేజ్ వయస్సులోనే ‘తొలి’ అనుభవాన్ని పొందుతున్నారట. ఐస్లాండ్‌లో 15.6, డెన్మార్క్‌లో 16.1, స్వీడన్‌లో సరాసరి 16.2 ఏళ్ల వయస్సులోనే శృంగారాన్ని మొదలుపెట్టేస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. యూకేలో సరాసరి 18.3 సంవత్సరాల నుంచి సెక్స్ చేస్తున్నారట. తొలి అనుభవం విషయంలో కూడా ఇండియా, చైనాలు వెనుకబడినట్లు సర్వేలో పేర్కొన్నారు. మన దేశంలో సరాసరిగా 22.9 ఏళ్లకు, చైనాలో 22.1 వయస్సులో తొలి అనుభవం పొందుతున్నారు. మలేషియాలో 23 ఏళ్లు వచ్చాకే సెక్సులో పాల్గొంటున్నారట.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి