Walking Tips: బరువు తగ్గాలంటే రోజూ ఎన్ని నిమిషాలు? ఎంత దూరం నడవాలి? ఇదిగో.. ఇలా చేయండి!
న్యూ ఇయర్ పురస్కరించుకుని నడక మొదలుపెట్టారా? అయితే, అది ఆరంభ సూరత్వం కాకుండా ఉండాలంటే ఈ సూత్రాలను పాటించండి.
కొత్త ఏడాదిలో చాలామంది ‘న్యూ ఇయర్ రిజల్యూషన్’ కింద బరువు తగ్గాలని తీర్మానించుకుంటారు. అయితే, జిమ్‌లు లేదా యోగా కేంద్రాల్లో జాయిన్ అవుతారు. అయితే.. అవన్నీ ‘ఆరంభ సూరత్వమే’. ఎందుకంటే.. న్యూ ఇయర్‌లో చాలా సీరియస్‌గా ప్రారంభించే పనులను ఎవరూ చివరి వరకు కొనసాగించలేరు. కొత్త ఏడాదిలో కొత్త పనులకు శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లేవారు.. తర్వాతి రోజు దుప్పటి కప్పుకుని బొజ్జుంటారు. అయితే, మీరు మాత్రం అలా మారొద్దు. బరువు తగ్గాలంటే వ్యాయామాలు, యోగాసనాలు చేయక్కర్లేదు. కనీసం నడిస్తే చాలు. అలాగని.. ఇంట్లో అటూ ఇటూ తిరిగేసి.. ‘‘హమ్మయ్య.. నడిచేశాం’’ అనుకోవద్దు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా మీరు బరువు తగ్గాలని అనుకుంటే.. తప్పకుండా ఒక సమయాన్ని, దూరాన్ని నిర్దేశించుకోవాలి. క్రమం తప్పకుండా ఆ టైమ్‌ను పాటించాలి. అప్పుడే.. మీ కల నిజమవుతుంది. బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. మరి.. రోజుకు ఎంత సేపు.. ఎంత దూరం నడవాలో చూసేద్దామా!
❤ బరువు తగ్గి శరీరం తేలిగ్గా మారాలంటే.. మీరు రోజుకు కనీసం 30 నిమిషాల నుంచి 90 నిమిషాలు (సుమారు గంటన్నర) నడవాలి. లేదా వారంలో కనీసం 150 నిమిషాలు నడవాలి.
❤ మీరు నడిచే వేగాన్ని బట్టి.. ఎంత సమయంలో ఎంత దూరం నడవగలరనేది తెలుస్తుంది. 30 నిమిషాల సాధారణ నడకతో 2.5 కిలోమీటర్లు నుంచి 3.3 కిమీలు నడవచ్చు.
❤ 30 నిమిషాల్లో కనీసం 100 నుంచి 300 క్యాలరీలు ఖర్చవుతాయని అంచనా.
❤ వాకింగ్ చేసేప్పుడు మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు కరుగుతాయి.
❤ 30 నిమిషాల నడిస్తే శరీరంలో నిల్వ ఉన్న చక్కెర, కొవ్వులు ఇంధనలా మండుతాయి.
❤ నడకంటే.. మరీ స్లోగా ఉండకూడదు. వీలైనంత వేగంగా.. శరీరం మొత్తం కదిలిపోయేలా వడి వడిగా అడుగులు వేయాలి.
❤ వేగంగా నడవడం వల్ల మీరు ఎక్కువ సార్లు ఊపిరి పీలుస్తారు. దీని వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది.
❤ మీకు గుండె, డయాబెటీస్, కిడ్నీ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే వాకింగ్ చేయాలి.
❤ గుండె సమస్యలు ఉన్నవారు ఫిట్‌నెస్ బ్యాండ్ ధరించడం మంచిది. నడుస్తున్నప్పుడు ఎప్పటికప్పడు హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోవాలి.
❤ మొదటిసారి వాకింగ్ చేసేవారు ఎక్కువ దూరం నడవలేరు. అలాంటివారు 10 లేదా 15 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని నడవచ్చు.
❤ నిద్ర నుంచి లేచిన వెంటనే నడక మొదలు పెట్టేయకూడదు. కాసేపు వార్మింగ్ అప్ చేయాలి.
❤ నడిచేప్పుడు చేతులు ముందుకు, వెనక్కి కదపాలి.
Also Read: అద్భుతం.. వేళ్లతో కాదు ‘మెదడు’తో ట్వీట్లు చేస్తున్న పెద్దాయన.. ఇదిగో ఇలా..
❤ మొబైల్ ఫోన్ చూస్తూ నడవడం అంత మంచిది కాదు. దానివల్ల మీరు సాధారణం కంటే నెమ్మదిగా నడుస్తారు. అది ప్రమాదకరం కూడా.
❤ వాకింగ్ మొదలుపెట్టిన వ్యక్తులు తొలి రోజే ఎక్కువ దూరం నడవకూడదు. శరీరం వాకింగ్‌కు అలవాటు పడేవరకు దూరాన్ని పెంచుకుంటూ పోవాలి.
❤ కొత్తగా వాకింగ్ చేసేవారు ఒకే రోజు ఎక్కువ సమయం నడవ కూడదు. దానివల్ల తర్వాతి రోజు నడవడం చాలా కష్టమవుతుంది.
❤ కొంతమంది వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే నడుస్తారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
❤ మీరు ఒక రోజు వాకింగ్ మొదలుపెట్టారంటే.. దాన్ని గ్యాప్ లేకుండా కొనసాగించాలి.
❤ Centers for Disease Control and Prevention(CDC) సూచనల ప్రకారం.. బరువు తగ్గాలంటే రోజూ కనీసం గంట నుంచి గంటన్నర నడవాలి.
❤ అడుగులను కౌంట్ చేసుకోవడం ద్వారా కూడా నడకను ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకు మీ మొబైల్‌లో ‘స్టెప్స్ కౌంట్’ యాప్ లేదా ఫిట్‌నెస్, స్మార్ట్ వాచ్‌లు ఉండాలి.
❤ ఓ అధ్యయనం ప్రకారం రోజుకు ఏడు వేల అడుగులు నడిస్తే మంచిదని తేలింది.
....ఇంకెందుకు ఆలస్యం. వెంటనే పై సూత్రాలను మైండ్‌లో పెట్టుకుని ఆడుతూపాడుతూ నడిచేయండి మరి.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి.
Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి