Salt Remedy: రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే అప్పుల బాధలు పోయి, ఆర్థికంగా కలిసొస్తుందట...
సమాజంలో ఎన్నో నమ్మకాలు. వాటిని నమ్మేవారి, పాటించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
తెలుగువారికి ఆచార వ్యవహారాలు, నమ్మకాలు చాలా ఎక్కువ. ఉదయం లేచినప్పటి నుంచి వాటిని ఫాలో అవుతూనే ఉంటారు. పండితులు కూడా ప్రతి సమస్యకు చేయాల్సిన రెమెడీస్ చెబుతూనే ఉంటారు. అలాగే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవడానికీ కొన్ని రెమెడీస్ వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా రాళ్ల ఉప్పుతో కొన్ని పనులు చేస్తే ఆర్థికంగా కలిసొస్తుందని చెబుతారు. అలాంటి నమ్మకాలే కొన్ని ఇవిగో...
1. రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో దాచుకోండి. అలా పెడితే ఆర్ధికంగా కలిసొస్తుందట. ఇబ్బందులు తొలగిపోతాయిట.
2. ఇంటిని కడిగేటప్పుడు ఆ నీళ్లలో రాళ్ల ఉప్పుతో పాటూ పాటు కాస్త పసుపు కలపండి. ఉప్పు కరిగిపోయాక ఆ నీళ్లతో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరిగి అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభం కలుగుతుంది. అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఇలా రాళ్ల ఉప్పు వేసిన నీటితో కడిగితే చాలా మంచిది. దోషం పోయి సురక్షితంగా ఉంటారు. అలాగే మీరు చేసే స్నానం నీటిలో కూడా ఇలా కలుపుకుని చేస్తే మానసిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం.
3. రాళ్లఉప్పుడు చిన్న పాత్రలో వేసి బాత్రూమ్‌లో ఏదో ఒక మూల పెట్టాలి. నీరు మాత్రం ఆ పాత్రపై పడకూడదు. ఆ ఉప్పు కరిగేంత వరకు అలా ఉంచి, ఉప్పు కరిగిపోయాక తీసేసి, మళ్లీ ఉప్పు వేసి పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంటిపై పడే చెడు దృష్టి పోతుంది. అలాగే ఆర్ధికంగా కలిసొచ్చి దారిద్ర్యం పోతుంది.
4. బెడ్రూమ్‌లో అల్మరాలో రాళ్ల ఉప్పును వేసిన పాత్రను ఉంచితే చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అయితే ఆ ఉప్పును ప్రతి వారం మారుస్తూ ఉండాలి.
Also read: సజ్జ రొట్టె లేెదా జొన్న రొట్టె... ఈ రెండింటిలో బరువు తగ్గేందుకు ఏది తింటే బెటర్?
Also read: యాంగ్జయిటీ లక్షణాలు తగ్గాలంటే వ్యాయామం చేయాల్సిందే... కొత్త అధ్యయన ఫలితం
Also read: బిడ్డకు తల్లి పాలే పడకపోవడం నిజంగా శాపమే, ఈ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయంటే...
Also read: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?