Yawning: ఆవలింతలు వస్తున్నాయా... అయితే మెదడు మీకేదో చెప్పాలనుకుంటోంది
నిద్ర సరిపోక ఆవలింతుల వస్తాయని అనుకుంటారు చాలా మంది. కానీ దానికి మరిన్ని కారణాలు ఉన్నాయి.
కొందరికి ఉదయం పడుకుని లేచాక ఓ గంట సేపు ఆగకుండా ఆవలింతలు వస్తూనే ఉంటాయి. మరికొందరికి సాయంత్రం అధికమవుతాయి. నిజానికి అందరూ అనుకునేదేమంటే నిద్ర సరిపోక లేదా నిద్ర వచ్చే క్రమంలో ఆవలింతలు వస్తాయని అనుకుంటారు. కానీ చాలా మందికి అసలవెందుకు వస్తాయో, కారణమేంటో తెలియదు. ఆవలింతలు ఎందుకొస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది.
గర్భంలోనే మొదలు...
ఆవలింతలు పుట్టాక, పెద్దయ్యాక కాదు బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమవుతాయి. ఆవలింతలు ఆగిపోవడమనేది జరుగవు. ప్రతి మనిషికి రోజులో ఏదో ఒక సమయంలో ఆవలింతలు వస్తూనే ఉంటాయి. దీనికి ముఖ్య కారణం ఆక్సిజన్. మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. దాన్ని మోసుకెళ్లే బాధ్యత రక్తానిదే. అయితే శరీరానికి లేదా మెదడుకు కావాల్సినంత ఆక్సిజన్ అందనప్పుడు ఆవలింతలు అధికంగా వస్తాయి. రాత్రిపూట తక్కువ నిద్రించేవారిలో శరీరానికి ఆక్సిజన్ సరిగా అందదు. వారిలో ఉదయం లేచాక ఆవలింతలు అధికంగా వస్తాయి. అలాగే అతిగా నిద్రించేవారిలో కూడా ఇవి అధికంగా వస్తాయి.
పని ఎక్కువైనా కూడా...
ఏ పని చేసినా దానికి మెదడు పనిచేయడం చాలా అవసరం. మెదడు బాగా పనిచేసి అలసిపోయినప్పుడు కూడా ఆ విషయాన్ని ఆవలింతల రూపంలో మనకు తెలియజేస్తుంది. అంటే ఇక విశ్రాంతి తీసుకోండి అని చెప్పడమే. ఆవలింతలు తీయడం ద్వారా మెదడు కూడా కాస్త రీఫ్రెష్ అవుతుంది. చురుగ్గా మారుతుంది. అందుకే ఆవలింతలొస్తే చక్కగా నోరు తెరిచి తీసేయండి. మీ మెదడు ప్రశాంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: అతిగా నీళ్లు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
Also read: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా
Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు
Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు