Silver Anklets: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా
వెండి పట్టీలు పెట్టుకోవడం ఆభరణమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
![Silver Anklets: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా Here are the health benefits of wearing silver anklets Silver Anklets: వెండి పట్టీలు... ఆభరణాలే కాదు, ఆరోగ్యాన్నందించే అస్త్రాలు కూడా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/c9229abcd090f8813c2aa5de6a750584_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆమె కోసం మొదట కొనే ఆభరణం ‘వెండి పట్టీలు’. గజ్జెలు ఘల్లుఘల్లుమంటూ ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఆ కళే వేరు. భారతీయ సంస్కృతిలో పట్టీలు ధరించడం ఒక భాగం. దీనికున్న సామాజిక ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. అయితే వెండిపట్టీలు కాళ్లకి అందాన్నే కాదు, అవి ధరించిన ఆడపిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. వీటిని ధరించడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నొప్పి తగ్గుతుంది
తరచుగా కాళ్లలో నొప్పి, వణుకు, తిమ్మిరి వంటి సమస్యలు కలగడం సహజం. వెండి పట్టీలు ధరించే వారిలో ఈ సమస్యలు తక్కువ వస్తాయి. వెండిలోని గుణాలు ఆ నొప్పిని తగ్గించడంలో ముందుంటాయి. మీలో సానుకూల శక్తిని పెంచుతాయి.
మడమవాపు రాకుండా
చాలా మంది స్త్రీలలో పాదం మడమ నొప్పి రావడం, వాపు రావడం కలుగుతుంది. ఇది రోజు వారీ పనులను సక్రమంగా చేసుకోనివ్వదు. ఈ నొప్పులు తరచూ వచ్చే వారు వెండి పట్టీలు ధరిస్తే మంచిది. ఇవి మడమల వద్ద రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల నొప్పి, వాపు వంటివి కలగవు.
ఆ సమస్యలు తగ్గేలా
స్త్రీలలో అనేక గర్భాశయ సమస్యలు, జననేంద్రియ సమస్యలు కలుగుతుంటాయి. వీటిలో కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల కలుగుతాయి. వెండి లోహం మీ చర్మానికి తగులుతూ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలలో హార్మోన్ల సమతుల్యత కూడా ఒకటి. పీరియడ్స్ క్రమం తప్పడం, ఊబకాయం వంటి ఆరోగ్యసమస్యలు కూడా అదుపులో ఉంటాయి.
శక్తి వృధా కానివ్వదు
వెండి మీ శరీరంలోని శక్తిని వృధాగా పోనివ్వదు. అంతేకాదు శరీరాన్ని మరింత శక్తిమయం చేస్తుంది. అందుకే వెండి పట్టీలు పెట్టుకున్న అమ్మాయిలు చాలా చురుగ్గా ఉంటారు. అంతేకాదు వారిలో దేవుని పట్ల నమ్మకం కూడా పెరుగుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
వెండి ఆభరణాలు ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెండిలోని లోహగుణం శరీరంలో అవయవాలు రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది. అందుకే ఇవి కేవలం ఆభరణాలే కాదు, అంతకుమించి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: చలికాలపు అనారోగ్యాలకు చెక్ పెట్టే వెల్లుల్లి సూప్ ... వారానికోసారి తాగినా చాలు
Also read: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
Also read: ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, మీ కోసం అందమైన కోట్స్ ఇవిగో...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)