New Year 2022 Wishes: హ్యాపీ న్యూ ఇయర్ 2022: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను ఇలా తెలుగులో విష్ చేయండి, అందమైన కోట్స్ ఇవిగో...
New Year 2022 Quotes in Telugu: మరికొన్ని గంటల్లో 2021 వీడ్కోలు పలకబోతున్నాం. 2022కు సాదరంగా స్వాగతం చెప్పబోతున్నాం.
New Year 2022 Wishes in Telugu: రెండేళ్లుగా కరోనా కష్టాలతోనే కొట్టుమిట్టాడుతున్నాం. కరోనా మన స్వేచ్ఛని, ఆరోగ్యాన్ని లాగేసుకుంది. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి 2022లో సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాని కోరుకుందాం. అందమైన కోట్స్‌తో సరికొత్త ఆశలు చిగురించేలా ప్రియమైన వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపండి. మీ కోసం తెలుగులో న్యూ ఇయర్ విషెస్‌ను ఇక్కడ అందిస్తున్నాం. కాపీ చేసి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారికి పంపే మెసేజులో పేస్టు చేస్తే చాలు.
1. కరోనాతో ముడిపడిన గతాన్ని మరిచిపోదాం,
బాధను విడిచిపెడదాం, నవ్వును మాత్రమే ఒడిసి పట్టుకుందాం,
కేవలం సంతోషం గురించి మాత్రమే ఆలోచించండి...
ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం
అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయర్.
2. ఈ నూతన సంవత్సరం మీకు కొత్త మార్గంలో నడిచేందుకు,
విజయ శిఖరాలను చేరుకునేందుకు ఒక అందమైన ప్రయాణంగా మారుతుందని ఆశిస్తున్నాం.
హ్యాపీ న్యూ ఇయర్
3. కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ... హ్యాపీ న్యూ ఇయర్ 2022
4. కొత్త ఆశలు... కొత్త ఆశయాలు
కొత్త నిర్ణయాలు... కొత్త లక్ష్యాలు
ఈ కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు
5. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నా...
మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
6. ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి సూచిక.
ధైర్యం, విశ్వాసం, గొప్ప ప్రయత్నంతో మీరు కోరుకున్న ప్రతి దాన్ని సాధిస్తారు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
7. ఒక కొత్త పుస్తకాన్ని తెరుస్తున్నాం.
దానిలో పేజీలన్నీ తెల్లగా, ఖాళీగా ఉంటాయి.
మనమే ఆ పేజీలను మరువరాని జ్ఞాపకాలతో, అవకాశాలతో, విజయాలతో, అందమైన స్నేహాలతో నింపాలి.
ఆ కొత్త పుస్తకం పేరు ‘న్యూ ఇయర్ 2022’.
హ్యాపీ న్యూ ఇయర్.
8. కొత్త ఏడాది మనకు చెదిరిన బంధాలను,
విషయాలను క్రమపద్దతిలో మళ్లీ అమర్చుకోవడానికి,
మన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి
మరొక అవకాశాన్ని అందిస్తోంది.
9. మరొక ఏడాది గడిచిపోయింది.
వచ్చే కొత్త సంవత్సరం మీ ప్రయాణంలో ఎన్నో విజయాలు,
ఆనందాలతో పాటూ కొన్ని అడ్డంకులను తేవచ్చు.
వాటిని అధిగమించడానికి మీకు ధైర్యం, విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కొత్త ఏడాది మీకు అద్భుతమైన ఏడాదిగా మారాలని ఆశిస్తున్నాను.
10. గతాన్ని మర్చిపోదాం, కొత్త సమయాన్ని ప్రారంభిద్దాం.
మనల్ని బాధపెట్టిన ఘటనలను, మనుషులను క్షమించేద్దాం.
పాత బంధాలను కలుపుకుందాం.
కొత్త స్నేహాలను స్వాగతిద్దాం.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా...
Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది